బాబు కన్నా టీడీపీ లో గొప్ప నేతలున్నారు..

 Posted October 18, 2016

chandrababu B grade survey
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి తాను చేయించిన సర్వే తోనే పెద్ద చిక్కొచ్చి పడింది.సర్వే చేయించిన ఆయనకి కూడా ఏ గ్రేడ్ రాలేదట.కుప్పం ఎమ్మెల్యేగా బాబు పని తీరు మీద కూడా ప్రజాభిప్రాయం తీసుకున్నారు.చివరికి ఏడు పేజీల నివేదికలో బాబు పనితీరు గురించి ఆయనకు కూడా నివేదిక అందింది.

1.ఎమ్మెల్యేగా బాబు పనితీరు,ప్రజలేమనుకుంటున్నారు?
2.ఎన్నికలొస్తే బాబు భవిష్యత్ ఎలా వుండబోతోంది?
3 . ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా?నియోజక వర్గ అభివృద్ధి ఎలా వుంది?
4. ప్రజా సమస్యలపై ఎలా స్పందిస్తున్నారు?
5.ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారా?బంధుగణం ఆగడాలకు దిగుతున్నారా?

ఈ ప్రశ్నలకి ప్రధానంగా సమాధానాలు రాబట్టారు.ఇందులో కుప్పం ప్రజలకి అందుబాటులో ఉండటంలో బాబు వెనుకపడ్డంతో ఆయనకి సర్వే లో బి గ్రేడ్ మాత్రమే వచ్చిందట.రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేగా ఏ గ్రేడ్ సాధించలేకపోయారు బాబు.దీంతో ఏ గ్రేడ్ వచ్చిన ఎమ్మెల్యేల్ని సాటి ఎమ్మెల్యేలు మీరు బాబు కన్నా గొప్పని ఆట పట్టిస్తున్నారట.

SHARE