Posted [relativedate]
ఏపీలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు వైసీపీ చాలా వరకు ఖాళీ అయ్యింది. వైసీపీకి చెందిన ముఖ్యనేతలు చాలా మంది ఆకర్ష్ లో భాగంగా టీడీపీలోకి వచ్చేశారు. గత కొంతకాలంగా వైసీపీ నుంచి ఈ చేరికలు ఆగిపోయాయి. ఇప్పుడు మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారట. అందులో భాగంగానే తనను వైసీపీ ఎమ్మెల్యేలు కలవడానికి వచ్చినప్పుడు పరోక్షంగా ఇదే విషయాన్ని చెప్పారట. అభివృద్ధిలో భాగం కావాలంటూ… తాను చెప్పాల్సింది చెప్పేశారట.
సీఎం చంద్రబాబు స్వయంగా ఆహ్వానం పలకడంతో టీడీపీలో చేరితే ఎలా ఉంటుందని వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఆలోచిస్తున్నారట. అంతేకాదు తోటి ఎమ్మెల్యేలతో ప్రస్తుతం ఇదే విషయంపై మంతనాలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. అభివృద్ధి పేరుతో టీడీపీలోకి జాయినైతే.. ఇక భవిష్యత్తుకు కూడా ఢోకా ఉండదనే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారట. సో మంచి తరుణం మించిన దొరకదన్న తరహాలో సాధ్యమైనంత త్వరగా సైకిలెక్కి… బాబుగారి దగ్గర మార్కులు కొట్టేద్దామనే ప్లానులో ఉన్నారట వైసీపీ ఎమ్మెల్యేలు. అయితే అలాంటి వారు ఎంతమంది ఉన్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.