లోకేష్ జాతకం…క్యాబినెట్ విస్తరణకు లింకు?

  chandrababu change ap cabinet before dasara because lokesh
ఏపీ క్యాబినెట్ విస్తరణకు దసరా ముహూర్తం ఖరారైందని ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే అంతకన్నా ముందే క్యాబినెట్ కొత్త రూపం తీసుకోనుంది.మార్పులు చేర్పులు అన్ని అనుకున్నదాని కంటే ముందే జరిగిపోతాయని విశ్వసనీయ సమాచారం.అక్టోబర్ 1 వ తేదీన క్యాబినెట్ విస్తరణ జరిపేలా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈ కొత్త ముహూర్తం వెనుక సీక్రెట్ ఏంటా అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయ్యారట.అయన అందుకోసం మంచి ముహూర్తం కావాలని పురోహితుల్ని సంప్రదిస్తే ..లోకేష్ జాతకం ప్రకారం అక్టోబర్ 1 అన్ని విధాలుగా ఆయనకి కలిసి వస్తుందని చెప్పారట.దాన్ని దృష్టిలోఉంచుకొని అదే రోజు క్యాబినెట్ విస్తరణ చేయాలని బాబు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం విస్తరణ ముహూర్తం మార్చడం బాబు లాంటి వాళ్ళకి పెద్ద లెక్కా ?

SHARE