చంద్రబాబు చిట్ చాట్.. రేర్ టాపిక్స్

 chandrababu chit chat rare topics
తన పెళ్లి, రాజకీయ జీవితంలోని ఆసక్తికర సంఘటనలను పంచుకున్న బాబు.

23 ఏళ్లకే ఎమ్మెల్సీగా పోటీకి సిద్ధపడ్డా వయస్సు సరిపోదన్న విషయం తెలియదు.

28 ఏళ్లకు ఎమ్మెల్యే అయ్యా. కేబినెట్ లోకి తీసుకోమని చెన్నారెడ్డిని అడిగా. యంగ్ ఎమ్మెల్యేవి అప్పుడే మంత్రి అడుగుతున్నావ్ అన్నాడు. ఆ తర్వాత అంజయ్య కేబినెట్ లో అవకాశం వచ్చింది.

జయకృష్ణ నా దగ్గరకు వస్తుండేవాడు. ఎన్టీఆర్ ను కలవాలనుకుంటున్నానని ఆయనకు చెప్పాను. అనురాగదేవత షూటింగ్ లో కలిశాం రాజకీయాలు బాగాలేవు…బాగుచేయడానికి మీలాంటి వాళ్లు రావాలని సూచించా.

60 ఏళ్ల వరకు నా జీవితం కుటుంబానికి…ఆ తర్వాత మాత్రం ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఉంది అన్నారు. నేను ఫెరోషియస్ గా ఉండే వాడిని…రాత్రికి రాత్రే మొత్తం మార్పు తేవాలన్నట్టు ఉండే వాడిని.

పెళ్లి అట్టహాసంగా జరిగింది.
 

గుజరాత్ సీయంగా ఉన్నప్పుడు మోదీ రాజీనామా కోరా. అలా ఎందుకు కోరాల్సి వచ్చిందో ఆయనకు వివరించా.

పాచిపోయిన లడ్డు అని పవన్ అన్నారు. పాచిపోయినవైతే నేనెందుకు తీసుకుంటా.

జాతీయ పార్టీ అధ్యక్షుడుగా హైదరాబాద్ వస్తుంటా.

SHARE