టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోకి తొలిసారి బాబు..

 Posted October 18, 2016

chandrababu coming ap tdp state chamber guntur first time
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి లోకేష్ కోటలోకి రేపు అడుగుపెట్టబోతున్నారు.హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ కేంద్రం గా రెండు రాష్ట్ర శాఖలు కొనసాగాయి .బాబు అమరావతి వచ్చాక గుంటూరు లో రాష్ట్ర స్థాయి కార్యాలయం ఏర్పాటు చేశారు.అయితే అది ఏర్పాటైన దగ్గరనుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు సాగుతున్నాయి.పక్కనే ఉంటున్నా బాబు ఇప్పటిదాకా రాష్ట్ర కార్యాలయానికి రాలేదు .తొలిసారి రేపు అయన అక్కడికి రాబోతున్నారు. దీంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు తహతహలాడుతున్నాయి .బాబుకి భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు .19 వ తేదీ సాయంత్రం బాబు చేతుల మీదుగా 10 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.ఇక లోకేష్ కూడా తన నిర్వహణా సామర్ధ్యాన్ని తండ్రికి చూపేందుకు దీన్నో అవకాశంగా తీసుకుంటున్నారు.

SHARE