బాబుకి హరికృష్ణ తో రాజీ ?

Posted [relativedate]

chandrababu compromise with harikrishna
మన మీద గుర్రుగా వున్నవాళ్లు హఠాత్తుగా మన ఇంట్లో ప్రత్యక్షమైతే ఏమి చేయాలో ..దాన్ని ఎలా తీసుకోవాలో తెలియక సతమతమవుతాం.ఈ ఇబ్బందే ఎదురై ఇబ్బంది పడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి వచ్చారు చంద్రబాబు.పార్టీ సహచరుల్ని పలకరిస్తుండగానే ఆయనకి షాక్ తగిలింది.ఎదురుగా సొంత బావమరిది,పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన హరికృష్ణ.కొన్నాళ్లుగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న హరికృష్ణ హఠాత్తుగా కంటిముందు కి వచ్చేసరికి బాబు కాస్త తడబడి వెంటనే కుదురుకున్నారు.చంద్రబాబుతో పాటు పొలిట్ బ్యూరోలోని ఇతర సభ్యులు సైతం హరికృష్ణని మీటింగ్ లో చూసి ఆశ్చర్యపోయారు.

పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతున్నంత సేపు హరికృష్ణ ని సభ్యులు ఆసక్తిగా,ప్రత్యేకంగా గమనిస్తూనే వున్నారు.మీటింగ్ అయిపోయాక హరి రాకలో అంతరార్ధం గురించి చర్చించుకున్నారు. కొన్నేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న హరిని దువ్వడానికి వైసీపీ గట్టి ప్రయత్నాలు చేసింది.అవి ఫలించవచ్చని కూడా ఆ మధ్యన సోషల్ మీడియా కోడై కూసింది.ఆ కూతలు కూతలుగానే మిగిలిపోగా హరి పొలిట్ బ్యూరోలో ప్రత్యక్షమై టీడీపీ లో సరి కొత్త చర్చకి తెర లేపారు.తనయుడు ఎన్టీఆర్ సినీ,రాజకీయ భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని పార్టీకి తాము వ్యతిరేకం కాదని చెప్పుకునేందుకు హరికృష్ణ ఈ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా హరి నిర్ణయానికి మద్దతు ఇచ్చాడట.ఎప్పుడో ఏదో జరుగుతుందో లేదో తెలియనిదానికి తొందరపాటు తగదని తండ్రీకొడుకులకి దగ్గరి వాళ్ళు నచ్చజెప్పిన మీదట హరికృష్ణ ఇలా డిసైడ్ అయ్యారట.మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎటువైపు ఉంటాడో అర్ధంకాని బాబే తన అనుచరులతో ఎన్టీఆర్ క్యాంపు కి రాజీ సంకేతాలు పంపినట్టు చెబుతున్నారు.ఇందులో ఏది నిజమైనా కాకపోయినా టీడీపీ లో మళ్లీ వారసత్వ రాజకీయాల చర్చకు తెర లేవడం ఖాయం అనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here