ఓదార్పు….ఇప్పుడు బాబు వంతు

 Posted October 19, 2016

chandrababu consolation to tdp party leaders
సరైన గ్రేడ్ లేకుండా ఇంటికి ప్రోగ్రెస్ రిపోర్ట్ తో వచ్చిన పిల్లాడికి ముందు తండ్రి తిట్లు …తర్వాత తల్లి ఓదార్పు .ఇది మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిపెరిగిన వారందరికీ చిరపరిచితమైన సీన్.ఎక్కువమందికి అనుభవంలోకి కూడా వచ్చే సంఘటన.ఇప్పుడు తల్లి,తండ్రి మాత్రమే కాదు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చే గురువు పాత్ర కూడా చంద్రబాబుదే అవుతోంది.అదెలాగంటే ..

ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించిన టీడీపీ ఇటీవల కె.ఎల్ .యూనివర్సిటీ లో వారికి ప్రోగ్రెస్ రిపోర్ట్ లు అందజేసింది.ఆ పని ఎవరు చేసినా రిపోర్ట్ లు ఆలోచన, అమలు చంద్రబాబుదే .అక్కడితో గురువు పాత్ర అయిపోయిందని బాబు అనుకొని వుంటారు.కానీ ఆ తర్వాత తక్కువ గ్రేడ్ వచ్చిన ఎమ్మెల్యే లతో మాట్లాడదామని అయన అనుకున్నారు.బాబు పిలిపించకముందే వాళ్ళే అయన పేషీ ,క్యాంపు ఆఫీస్ ముందు బారులు తీరారు.తాము కష్టపడుతున్నామని అయినా కొన్ని తప్పులు జరిగాయని కొందరు ఎమ్మెల్యేలు ఒప్పుకుంటున్నారు.అయితే సర్వే లో వచ్చిన కొన్ని అంశాలు నిజం కాదని అయనకి మొర పెట్టుకుంటున్నారు.బాబు కూడా కొందరికి తలంటి తండ్రి పాత్ర,మరికొందరిని ఓదార్చి తల్లి పాత్ర పోషించాల్సివస్తోంది .మొత్తానికి ఈ ఓదార్పు మీద అవుట్ రైట్ రైట్స్ తీసుకున్న జగన్ ఏమంటారో ?

SHARE