Posted [relativedate]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సెక్యూరిటీ సిబ్బందికి తిప్పలు తెచ్చాడు…వారితో ముసిముసి నవ్వులు కురిసేలా చేసాడు.ఇంతకీ విషయమేంటంటే ఓ ఔత్సాహికుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ ని ఉండవల్లి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో స్వయంగా తొక్కారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చాన్నాళ్లుగా సైకిల్ తొక్కే అలవాటుకి దూరం కావడంతో అయన కాస్త తడబడ్డారు.ఓ వైపు ఆయన్ను పడకుండా చూస్తూనే మరోవైపు ముసిముసి నవ్వులు రువ్వారు సెక్యూరిటీ సిబ్బంది. బాబు సైకిల్ ఎపిసోడ్ దృశ్యాలు బయటికి వచ్చిన మరునాడే బాలయ్య బులెట్ ఎక్కాడు.హిందూపురం పర్యటనకి వెళ్లిన బాలయ్య అక్కడ పార్టీ కార్యకర్తలతో కలిసి బులెట్ ర్యాలీ తీశారు.