బాబుకి 1/5 ఆఫర్ ఇచ్చిన జైట్లీ ..

 chandrababu demand package jaitley
ప్యాకేజ్ కి చట్టబద్ధత కల్పించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కేంద్రాన్ని కోరారు.అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన అయన ముందుగా కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీని కలిసి తన డిమాండ్ వినిపించారు.సానుకూలంగా స్పందించిన జైట్లీ. వచ్చే క్యాబినెట్ భేటీలో ఏపీ ప్యాకేజ్ కి ఆమోదముద్ర వేయిస్తామని  చెప్పారు. అంతే కాకుండా హోదా తో పదేళ్ల కాలంలో ఆంధ్రాకి వచ్చే లబ్ది కేవలం రెండేళ్లలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఏపీ కోసం చంద్రబాబు చేసే ప్రతి విజ్ఞప్తిని గౌరవం తో స్వీకరిస్తామని జైట్లీ చెప్పారు.గంటకి రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే జర్మనీ బులెట్ రైల్ ఏపీ కి వచ్చేలా కృషి చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.మొత్తానికి ఏపీ మాకు ప్రత్యేక రాష్ట్రమని కేంద్రం చెప్తున్న మాటలతో బాబు ఖుషీ అవుతున్నారు.ఆ మాటలు చేతల దాకా వస్తే జనం సైతం హ్యాపీ..

SHARE