టీడీపీకి హార్ట్ స్ట్రోక్ దెబ్బ

Posted April 18, 2017

chandrababu disappointed because of bhuma nagi reddy and devineni nehru deathతెలుగు నేలపై బలమైన ప్రాంతీయ పార్టీగా దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్న టీడీపీకి వరుసగా సీనియర్ నేతల హఠాన్మరణాలు షాకిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో బలమైన నేతలుగా ఉన్న వారు.. హఠాత్తుగా మరణించడం అధిష్ఠానాన్ని ఆవేదనకు గురిచేస్తోంది. 2014 ఎన్నికల ముందు కూడా ఇలాగే వరుసగా ముగ్గురు సీనియర్లు రోడ్డు ప్రమాదాల్లో మరణించడంతో.. ఆ బాథ నుంచి తేరుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఇప్పుడు నెలల వ్యవధిలో ఇద్దరు బలమైన నేతలు, తమ జిల్లాల్లో రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగిన వారు చనిపోయారు.

కొన్ని నెలల క్రితం భూమా నాగిరెడ్డి మరణించారు. కర్నూలు జిల్లాలో బలమైన నేతగా ఉన్న భూమా.. సగం జిల్లాలో గెలుపోటముల్ని ప్రభావితం చేయగలరు. ఆయన చనిపోవడంతో.. కూతురు అఖిలప్రియకు బాబు క్యాబినెట్ పదవి ఇచ్చారు. అఖిలప్రియకు ఆమె మేనమామ తోడుండటంతో.. నెగ్గుకొచ్చేస్తారనే వాదన ఉంది. పైగా భూమాకు ఉన్న బలమైన క్యాడర్ అఖిలప్రియకు అండగా ఉంది. అందుకే కర్నూల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా భూమా గ్రూప్ అంటా టీడీపీకి బాగా పనిచేసి గెలిపించేస్తారనే ధీమా చంద్రబాబు ఉంది.

ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా బలమైన నేతగా ఉన్న దేవినేని నెహ్రూ మరణం చంద్రబాబును కలిచివేసింది. దేవినేని ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతారు. అలాంటిది పార్టీలో చేరిన కొద్దిరోజులకే ఆయన మరణించడం.. సీఎం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన వారసుడిగా అవినాష్ ను బరిలోకి దిగడం ఖాయమే అయినా.. అవినాష్ దూకుడు తగ్గించుకోవాలని ఇప్పటికే చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. నెహ్రూలాగా ఆలోచించి ఆచితూచి అడుగేయాలనేది బాబు సలహా.

ఏది ఏమైనా వరుసగా సీనియర్లు మరణించం కారణంగా క్యాడర్ మనోనిబ్బరం కోల్పోకుండా చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారుచేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతల్ని ప్రోత్సహిస్తున్నారు. నాయకత్వాన్ని తయారు చేయడం తనకు కొత్త కాదని నిరూపిస్తున్నారు.

SHARE