మావోయిస్టుల్ని భయపెడుతున్న చంద్రబాబు

Posted April 11, 2017

chandrababu feared mavoyistsఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మావోయిస్టుల్ని కోలుకోలేని దెబ్బ తీశారు. శాంతిభద్రతలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చి.. కీలకమైన అగ్రనేతల్ని పోలీసులు టార్గెట్ చేసేలా చేశారు. ఇంటెలిజెన్స్ కు ఫుల్ పవర్స్ ఇవ్వడమే కాకుండా.. మావోయిస్టు నిరోధక దళానికి పూర్తిస్థాయిలో స్వేచ్చ ఇచ్చారు. దీంతో ఏపీ పోలీసులకు దేశంలోనే మంచి గుర్తింపు వచ్చింది. మరే మావోయిస్టు ప్రాభావిత రాష్ట్రంలోనూ లేనంత స్థాయిలో మావోయిస్టుల కార్యకలాపాలు ఏపీలోనే బాగా తగ్గిపోయాయి. అప్పుడు బాబు వేసిన పునాదులే.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మావోయిస్టుల కదలికల్ని తగ్గించాయనేది పోలీస్ అధికారులు కూడా ఒప్పుకునే వాస్తవం.

ఇప్పుడు విభజన తర్వాత కూడా ఏపీ, తెలంగాణలో మావోయిస్టులపై పోలీసులదే పైచేయిగా ఉంది. కానీ ఏవోబీలో జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు పెరిగాయని భావిస్తున్న పోలీసులు.. అందుకోసం పటిష్ఠమైన నిఘా వ్యవస్థ కావాలని ఏపీ సర్కారుకు రిక్వెస్ట్ పెట్టారు. దీంతో చంద్రబాబు వేగంగా స్పందిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నిఘా కోసం ప్రయత్నాలు చేశారు. చివరకు అఫ్గానిస్థాన్ లో అమెరికా వాడిన హైటెక్ టెక్నాలజీ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారు.

ఇజ్రాయెల్ తయారీ స్కై స్కాటర్ – 180 ఏరోస్టాట్ .. ఇదీ నూతన నిఘా వ్యవస్థ పేరు. ఒకేసారి వెయ్యి అడుగుల ప్రాంతాన్ని 360 డిగ్రీల కోణంలో ఇన్ ఫ్రారెడ్, సెన్సార్ల సాయంతో ఫోటోలు తీయగలగడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. సాధారణ రవాణా వాహనంలో ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే వీలుంది. ఏకధాటిగా మూడు రోజుల పాటు పనిచేస్తుంది. దీంతో ఈ టెక్నాలజీ కొనుగోలు చేయాలని పోలీసులకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మారుమూ నక్కిన మావోయిస్టులు కూడా తప్పించుకునే వీలుండదు. అటు తెలంగాణ కూడా ఏపీ సర్కారు ప్రయత్నాల్ని గమనిస్తోంది. సక్సెస్ అయితే తామూ వాడాలని చూస్తోంది.

SHARE