బాబు గుస్సా….

 Posted October 24, 2016

chandrababu fires because polavaram works slowపోలవరం ప్రాజెక్టు పనుల ఆలస్యంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొంత అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి వర్చువల్ ఇన్ స్పెక్షన్ నిర్వహించారు. ప్రాజెక్టు పనుల గురించి చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడంపై అధికారులు వివరణ ఇస్తూ, సైట్ కు పూర్తి స్థాయిలో సంబంధిత మిషనరీ చేరకపోవడంతో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. జనవరి నాటికి స్పిల్ వే, మార్చి నాటికి పవర్ హౌస్ పనులు, మే నాటికి స్పిల్ చానల్ తవ్వకం పనులు పూర్తి చేయాలని, ఏడాది చివరికి గేట్ల డిజైన్లపై అనుమతులు పొందాలని చంద్రబాబు ఆదేశించారు.

SHARE