ఆ 786 బ్లాక్ స్పాట్స్ …

cmbabవిశాఖపట్నంలో రహదారుల భద్రతపై జాతీయ సదస్సు ప్రారంభ‌మైంది.  ఈ సదస్సును కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం చంద్రబాబు ప్రారంభించారు.   దీనిలో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారణ‌కు తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌ను గురించి వివ‌రించారు. దేశంలో ప్ర‌మాదాలు అత్య‌ధికంగా చోటుచేసుకుంటోన్న 786 ప్రాంతాలను తాము గుర్తించినట్లు తెలిపారు. ఏటా లక్షన్నర మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 786 ప్రమాద రోడ్లను గుర్తించామని గడ్కరీ చెప్పారు. రూ.11,900 కోట్లతో గుంతలుపడిన రోడ్లను బాగుచేస్తామని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ వెల్లడించారు. మానవతప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అయన అన్నారు.
క్ష‌త‌గాత్రుల‌కు సాయం అందించ‌డానికి జాతీయ రహదారిపై కొన్ని ప్రాంతాల్లో ఇప్పిటికే అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతున్నామ‌ని గడ్కరీ తెలిపారు. వీటి సంఖ్య‌ను మరింత పెంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఒక అంబులెన్స్ ఉంచుతామ‌ని పేర్కొన్నారు. వాహ‌నాల‌ లైసెన్స్‌ల జారీ ప్ర‌క్రియ ఎటువంటి అవ‌క‌త‌వ‌క‌లు లేకుండా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. 
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్ర‌మాదాల ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఏటా లక్షన్నరమంది చనిపోతున్నారంటే అది ఆందోళ‌న చెందాల్సిన విష‌య‌మ‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు అనేక విష‌యాల కారణ‌మ‌వుతున్నాయ‌ని, అత్య‌ధికంగా ప్ర‌మాదాలు చోటుచేసుకుంటోన్న‌ 700 బ్లాక్‌స్పాట్స్‌ గుర్తించినట్లు పేర్కొన్నారు.  రోడ్డు ప్రమాదాల నివార‌ణ‌కు విరివిగా సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు.  
డ్రంకెన్ డ్రైవ్ చేస్తోన్న వారిప‌ట్ల‌ కఠినంగా వ్య‌వ‌హ‌రించాలని అన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ను నివారించగలిగితే 50 శాతం ప్రమాదాలు తగ్గుతాయని చంద్రబాబు తెలిపారు.రోడ్డుభద్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు. జీపీఎస్‌ ద్వారా వాహనాల వేగాన్ని గుర్తించాలని చంద్రబాబు తెలిపారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనలను కఠినతరం చేయాలని సీఎం అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు.
SHARE