సంక్రాంతికి బాబు వరం ఇదే…

Posted December 12, 2016

chandrababu give a internet to andhra pradesh in sankranthiరాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా రూ.149 కే నెట్‌, కేబుల్‌, టెలిఫోన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో జనవరి 14న సంక్రాంతి పండుగ రోజు నుంచి ఈ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా లక్ష కుటుంబాలకి ఈ సేవలు మొదలు పెడతారు. ఈ సేవలకు అవసరం అయ్యే, ఐపీ-టీవీ, ఇంటర్నెట్‌ మోడెమ్‌ల కోసం, విదేశీసంస్థలకు ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ లిమిటెడ్‌ ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. ఈ నెలలోనే, మొదటిగా లక్ష వరకు ఈ పరికరాలు అందించనున్నారు.

ఫ్రీ ఫోన్
ఫైబర్‌ గ్రిడ్‌ పరిధిలో కనెక్షన్ తీసుకున్న వినియోగదారులు ఒకరితో ఒకరు ఇంటర్‌కమ్‌ తరహాలో ఎంతసేపైనా ఉచితంగా మాట్లాడుకోవచ్చు. అదే ఇతర ఆపరేటర్లకు ఫోన్ చెయ్యాలి అంటే, ల్యాండ్‌ లైన్లకు ఫోన్‌ చేస్తే నిమిషానికి 50 పైసలు, మొబైల్‌ ఫోన్లకు ఫోన్‌ చేస్తే నిమిషానికి రూపాయి చొప్పున చార్జీని వసూలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ నంబర్లు.. 72తోనూ .. 50 నుంచి 59 వరకు ఉన్న సంఖ్యల సిరీ్‌సతో ప్రారంభమవుతాయి.

టీవీ

250 చానల్స్ అందిస్తారు. ఇందులో 30 వరకు తెలుగు చానల్స్ కూడా ఉంటాయి.
వీడియో ఆన్ డిమాండ్ సేవలతో, మీకు నచ్చిన సినిమా చూడవచ్చు, మీకు నచ్చిన పాటలు వినవచ్చు.
టీవీ కార్యక్రమాలు రికార్డింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది
టీవీ సీరియల్స్ మీకు నచ్చినప్పుడు, పాత ఎపిసోడ్స్ కూడా చూడవచ్చు
టీవీ ద్వారా స్టడీ మెటీరియల్, ఆన్లైన్ కోర్సులు, ఇంకా అన్ని రకాల శిక్షణా సదుపాయాలు ఉంటాయి
టీవీ ద్వారా దూర ప్రాంతాల్లోని వారికి, వైద్యు సేవలు పొందే అవకాసం
పైసా ఖర్చు లేకుండా, బంధు మిత్రులలతో వీడియో కాల్ చేసుకోవచ్చు
ఏపి యాప్ స్టోర్ ద్వారా, చాలా సదుపాయాలు ఉంటాయి.
టీవీనే కంప్యూటర్ గా వాడుకోవచ్చు

ఇంటర్నెట్

15 MBPS వేగంతో 5 GB వరకు ఇంటర్నెట్ వాడుకోవచ్చు
5 GB కంటే ఎక్కువ రావాలి అంటే, వేరే ప్లాన్ తీసుకోవాలి
ఇంటర్నెట్, టీవి కి కనెక్ట్ చెయ్యటం ద్వారా, మీ టీవీనే కంప్యూటర్ గా వాడుకోవచ్చు

ఇతర సేవలు

కొత్త సినిమాలు ఇంట్లో నుంచి చూడవచ్చు. కొంత చార్జీ పే చెయ్యాల్సి ఉంటుంది
కోరుకున్న వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు
కోరుకున్న పాటలు వినవచ్చు
వంటావార్పు కార్యక్రమాల ద్వారా గృహిణులు, మీకు కావలసిన వంటలు నేర్చుకోవచ్చు

వివిధ రకాల ప్లాన్స్, వాటి చార్జీలు
బేసిక్ ప్లాన్

ఇంటర్నెట్
స్పీడ్ – 15 MBPS
FUP పరిమితి – 5 GB
FUP పరిమితి తరువాత – 1 MBPS
టీవీ చానల్స్ – 250
ఫోన్ – ఫ్రీ
చార్జీ – 149/-

స్టాండర్డ్ ప్లాన్

ఇంటర్నెట్
స్పీడ్ – 15 MBPS
FUP పరిమితి – 25 GB
FUP పరిమితి తరువాత – 1 MBPS
టీవీ చానల్స్ – 250
ఫోన్ – ఫ్రీ
చార్జీ – 399/-

ప్రీమియం ప్లాన్

ఇంటర్నెట్
స్పీడ్ – 15 MBPS
FUP పరిమితి – 50 GB
FUP పరిమితి తరువాత – 1 MBPS
టీవీ చానల్స్ – 250
ఫోన్ – ఫ్రీ
చార్జీ – 599/-

కనెక్షన్ కావలి అంటే
మీ ఏరియా కేబుల్ ఆపరేటర్ను సంప్రదించాలి (జవనరి 14 తరువాత) మీ పాత ల్యాండ్ లైన్ ఫోన్ వాడుకోవచ్చు, లేదా కొత్తది కొనుక్కోవచ్చు సెట్ అప్ బాక్స్ కొత్తది కొనుక్కోవాలి. సెట్ అప్ బాక్స్ ధరకు సంభందించి, పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

SHARE