Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“టెక్నాలజీ అంటే చంద్రబాబు..చంద్రబాబు అంటే టెక్నాలజీ”అని టీడీపీ శ్రేణులు గర్వంగా చెప్పుకుంటాయి.కానీ సోషల్ మీడియా విషయానికి వచ్చేసరికి వైసీపీ ముందు టీడీపీ ప్రచారం వెలవెలబోతోంది.బాగా దెబ్బ తిన్న తరువాత కానీ ఈ విషయం దేశం శ్రేణులకు అర్ధం కాలేదు.ఓ వైపు ప్రభుత్వం కఠినంగా ఉన్నప్పటికీ వైసీపీ సోషల్ మీడియా విభాగం చురుగ్గా పని చేస్తోంది. అదే రూట్ లో అధికార పక్షం కూడా జగన్ ని టార్గెట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడా ఆ పార్టీ సోషల్ మీడియా లో యాక్టివ్ గా వున్న దాఖలాలు లేవు.ఎందుకిలా జరుగుతోందా అని ఆరా తీస్తే ఓ చిత్రమైన విషయం బయటికి వచ్చింది.
వైసీపీ స్థాయిలోనే టీడీపీ కూడా సోషల్ మీడియా మీద దృష్టి పెట్టింది.అయితే ఆ బాధ్యతను అసలు తెలుగు తెలియని,తెలుగు రాజకీయాలతో ఏ సంబంధం లేని గుజరాత్ కి చెందిన ఓ కంపెనీ కి అప్పగించింది.దీంతో వాళ్ళు ఏమి చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు..ఆ టీం కి కూడా తెలియని విషయాన్ని ఎలా డీల్ చేయాలో అర్ధం కావడం లేదు.పార్టీ ఆఫీస్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఒకరు చెప్పిన మీదట రాష్ట్రేతర టీం కి అత్యంత ముఖ్యమైన సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతలు అప్పగించిందట టీడీపీ.తాజా పరిణామాలతో కళ్ళు తెరిచి ఆ టీం ని సాగనంపి,తెలుగోళ్లతో సరికొత్త టీం ఏర్పాటు చేయడానికి లోకేష్ అండ్ కో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.మొత్తానికి తెలుగు దేశం పేరు పెట్టుకుని సోషల్ మీడియా ప్రచారంలో తెలుగోళ్ళకి స్థానం లేకుండా చేసి పెద్ద గుణపాఠమే నేర్చుకుంది టీడీపీ.