బాబు కి ఢిల్లీ పిలుపు… క్లైమాక్స్‌ లో ప్యాకేజీ

  chandrababu going delhi because special status package purpose 

ఏపీకి ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు కేంద్రం నేడు తెరదించే విధంగా పావులు కదుపుతోంది. వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఏపీ సీఎంకు హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు సమక్షంలోనే ప్రకటన చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భావిస్తున్నారు. ఊహించిన విధంగా ప్యాకేజీ ఉంటే మధ్యాహ్నం తర్వాత ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రధాని కార్యాలయంలో ఏపీకి సాయంపై మంతనాలు జరపనున్నారు. ఆర్థిక, హోం, ఇతర శాఖల ఉన్నతాధికారుల చంద్రబాబు భేటీ అవుతారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏపీ డిమాండ్లపై పరిశీలన జరగనుంది. ఆ తర్వాత చంద్రబాబుతో పీఎంవో అధికారులు మాట్లాడనున్నారు. ఏదేమైనా పరిణామాలను పరిశీలిస్తే సాయంత్రానికి చంద్రబాబు సమక్షంలో ప్రకటన వచ్చే అవకాశముంది.

SHARE