పుష్కరాలకు ఒలింపిక్స్ కి ముడిపెట్టిన బాబు ..

 chandrababu happy about pushkaralu food offering bigger than olympics food offering
చేసింది చెప్పుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని మించిన వారుండరేమో..కృష్ణ పుష్కరాల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అయన వాటిని నిర్వహించిన తీరుపై సంతృప్తిగా వున్నారు.

ఇక పుష్కర యాత్రీకుల కోసం చేసిన అన్నదానం ఏర్పాట్లపై బాబు ఫుల్ ఖుషీ ..ఇస్కాన్ ,అక్షయపాత్ర ఫౌండేషన్ తో పాటు వివిధ ధార్మిక సంస్థలు భక్తుల కోసం భారీగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాయి.పుష్కరాల్లో రోజుకి లక్షన్నర మందికి పైగా అన్నదానం చేశారు.

అన్నదానం గురించిన చర్చ వచ్చినపుడు బాబు ఆనందం పట్టలేకపోయారు .ఒలింపిక్స్ జరిగిన రియోలో రోజుకి 50 వేల మందికి భోజనం పెడితే మనం 1.50 లక్షల మందికి అన్నదానం చేయగలిగామని అన్నారు .ఇది గిన్నిస్ రికార్డు అయిఉంటుందని కూడా బాబు వ్యాఖ్యానించారు.అంతటితో ఆగకుండా అన్నదానంలో కీలక పాత్ర పోషించిన సంస్థల నుంచి వివరాలు సేకరించి గిన్నిస్ బుక్ నిర్వాహకులకు పంపాలని బాబు ఆదేశించారు.

SHARE