బాబు హిట్లర్ అయ్యాడా …పుట్టిన రోజు పాలిటిక్స్

Posted September 28, 2016

 chandrababu hitler nalla surya prakash
ఏపీ సీఎం చంద్రబాబు మీద దాడి ఉద్ధృతం చేసిన వైసీపీ ..స్థానిక నేతల నోరు చాలక తెలంగాణ నాయకుల్ని కూడా రంగంలోకి దింపింది.వైసీపీ తెలంగాణ కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ గుంటూరు వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.అయన బాబు పుట్టుక నుంచి మొదలెట్టారు. హిట్లర్ పుట్టిన రోజునే చంద్రబాబు కూడా పుట్టాడు కాబట్టి అదే హిట్లర్ పాలన చేస్తున్నారని బాబు మీద విరుచుకు పడ్డారు.

విమర్శల మాటేమో గానీ పుట్టినరోజుని కూడా రాజకీయం చేయడం చూస్తుంటే రోత పుడుతోంది.నిజంగా బాబు ..హిట్లర్ అయ్యుంటే నల్లా సూర్యప్రకాష్ ఇంత ధైర్యంగా మాట్లాడేవారా? అని దేశం నేతలు కౌంటర్ ఇస్తున్నారు.ఓ టీడీపీ నేత మరో అడుగు ముందుకేసి ఆ రోజు పుట్టిన వాళ్ళతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తానంటున్నాడు. ఏం చేద్దాం ! రాజకీయం మహిమ .

SHARE