పవన్,ముద్రగడ ఫోటోలు చూసి బాబు హర్ట్..వారికి ఊస్టింగ్?

0
631
chandrababu hurt on kapu corporation md and chairman because of kapu credit going to pawan kalyan and mudragada

 Posted [relativedate]

chandrababu hurt on kapu corporation md and chairman because of kapu credit going to pawan kalyan and mudragada
వచ్చే ఎన్నికల నాటికి కాపు ఓటు బ్యాంకు ని పటిష్టం చేసుకోడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఎంత ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం లేదంట.ఈ విషయాన్ని ఇంకెవరో చెప్పడం లేదు.తనను కలిసిన కాపు ఎమ్మెల్యేలు,నేతలు దగ్గర ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించి బాధపడ్డారట.కాపు రిజర్వేషన్ అమలు కోసం కమిషన్ వేయడం,వెయ్యి కోట్ల నిధులతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం,ఆ కార్పొరేషన్ ద్వారా విద్యా రుణాలు అందజేయడం….ఇలా ఎన్ని చేస్తున్నా ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రావడం లేదని బాబు అనుకుంటున్నారట.పైగా ఆ రుణాలు పొందినవాళ్లు పవన్,ముద్రగడ ఫొటోలతో ఫ్లెక్షీ లు వేసి కృతజ్ఞతలు చెప్తున్న విషయం తెలిసి బాబు బాగా హర్ట్ అయ్యారట.ఈ విషయంలో కాపు కార్పొరేషన్ చైర్మన్,ఎండీ పని తీరు బాగా లేదని బాబు ఓ నిర్ణయానికి వచ్చారట.ఆ ఇద్దరూ ఆధిపత్య పోరాటంలో పడి ప్రభుత్వ కార్యక్రమాలని కాపుల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనట్టు బాబు గుర్తించారట.దీంతో ఆ ఇద్దరికీ మంగళం పాడే ఛాన్స్ ఉందని టాక్.

ఇంతకు ముందెన్నడూ లేనంతగా కాపులకి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు బాబు కొత్త టీం ని రంగంలోకి దించే అవకాశం కనిపిస్తోంది.ఇందుకోసం ఓ సమర్ధుడైన ఐఏఎస్ అధికారితో పాటు,కాపుల్లో ప్రజాకర్షణ ఉండి ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచే రాజకీయ నేత కోసం బాబు అన్వేషణ సాగుతోందట. ఇప్పటికే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు,కృష్ణా జిల్లాకి చెందిన ఇంకో ఎమ్మెల్యే పేరుని బాబు చురుగ్గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.వీరిలో ఒకరికి కాపు కార్పొరేషన్ చైర్మన్ గిరీ తో పాటు ఆ వర్గాన్ని ఆకట్టుకునే బాధ్యత కూడా ఉంటుంది.అలాంటి నేత కోసం బాబు సాగిస్తున్న అన్వేషణ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

Leave a Reply