జన్మభూమి ఫై బాబు టెలికాన్ఫరెన్స్.. బులెట్ పాయింట్స్..

  Posted January 10, 2017
handrababu in janmabhumi teleconferenceజన్మభూమి-మాఊరు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

 

 • పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు,జిల్లాల కలెక్టర్లు, అధికారులు, జన్మభూమి నోడల్ ఆఫీసర్లు
 • సంక్రాంతి పెద్ద పండగను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నగదు అందుబాటు పెంచాలి: బ్యాంకర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు
 • రైతులకు నగదు కొరత లేకుండా చేయాలి:ముఖ్యమంత్రి చంద్రబాబు
 • ఆర్బీఐ అధికారులతో మాట్లాడి వెంటనే మరింత నగదు రాష్ట్రానికి వచ్చేలా చూడాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • రబీ రుణాల పంపిణీ వేగంగా పూర్తిచేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • ప్రధాని ప్రకటించిన 2నెలల వడ్డీమాఫీ ప్రయోజనం రాష్ట్రంలో ప్రతిరైతుకు అందాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • ఈవిషయంలో బ్యాంకర్లు మరింత శ్రధ్ధ తీసుకోవాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • అన్ని గ్రామాలు, వార్డులలో జన్మభూమి ముగింపు వేడుకలతోపాటు సంక్రాంతి సంబరాలను 12వ తేదీన ఘనంగా నిర్వహించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • జన్మభూమిలో బాగా పనిచేసిన వారికి అవార్డులు అందించాలి, గ్రామాభివృద్దికి తోడ్పడిన పార్టనర్లను(భాగస్వాములను) సత్కరించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • విద్యార్ధులు, మహిళలు, రైతులకు పోటీలు నిర్వహించాలి, విజేతలకు బహుమతులు అందించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • శ్రీకాకుళం జిల్లాలో 38గ్రామాలను నగదు రహితంగా ప్రకటించడం స్ఫూర్తిదాయకం: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • మిగిలిన జిల్లాల్లో కూడా నగదురహిత గ్రామాల జాబితా ప్రకటించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ(ఓడిఎఫ్) తరహాలో నగదురహిత లావాదేవీల(సిఎల్ టి) గ్రామాల ప్రకటనలు అన్ని జిల్లాలలో చురుకుగా చేయాలి: సీఎం చంద్రబాబు
 • వేలిముద్రల వైఫల్యం వల్ల సంక్రాంతి కానుకలు, రేషన్ అందలేదని ఎవరూ బాధపడరాదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • కానుకల పంపిణీలో ఏ ఒక్కరినీ తిరస్కరించవద్దు, అందరికీ కానుకలు పంపిణీ చేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • పనిచేయడం ఒక ఎత్తయితే దాని ఫలితం ప్రజలకు అందించడం మరోఎత్తు: సీఎం చంద్రబాబు
 • ఈ రెండింటిని సక్రమంగా నిర్వహిస్తేనే అనుకున్న ఫలితాలను రాబట్టగలం: టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
 • ఆదాయం, ఆనందం రెండూ ఉన్నప్పుడే సమాజంలో సంతోషం: టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
 • సమాజం సంతోషంగా ఉంటే జన జీవన ప్రమాణాల్లో అనూహ్య పెరుగుదల సాధ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబు
 • ఒక బాధ్యతగల సమాజం నిర్మించడం కోసం అందరూ సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
SHARE