ఎరక్కపోయి ఇరుక్కు పోయిన చంద్రబాబు…!

0
281
chandrababu in trouble by his own words

Posted [relativedate]

chandrababu in trouble by his own wordsఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం ఎరక్క పోయి ఇరుక్కు పోయినట్టు తయారైంది ..పెద్ద నోట్ల ను రద్దు చేయాలనీ కేంద్రానికి లేఖ రాసానని నోట్ల రద్దు ప్రకటన తరవాత చంద్ర బాబు చెప్పడం మొదట్లో ఆయనకు కొంత మైలేజ్ ఇచ్చినా రాను రాను ప్రజల నోట్ల కష్టాలు పెరిగి ఆ మైలేజ్ తగ్గుతూ వచ్చి అయన చేసిన ప్రకటనే అయన కొంప ముంచే పరిస్థితికి తెచ్చింది . ప్రజల్లో ఆర్ధిక కష్టాలు తీవ్ర రూపం దాల్చటం పనిలో పనిగా ప్రజలు చంద్రబాబు ను కూడా విమర్శించటం ఆనోటా ఆ నోటాఈ విమర్శలు బాబు కు చేరటం తో పాటు , ఓ ఎంపీ సూటిగా ఆయనకే పరిస్థితిని ప్రజల మాటల్ని వివరించటం తో బాబు పునరాలోచనలో పడక తప్పింది కాదు .

పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై దేశంలో బీజేపీ ముఖ్యమంత్రులే స్పందించకుండా నిశితంగా గమనిస్తున్నారు. పరిస్థితిని చూసిన తర్వాత తాపీగా మాట్లాడుతున్న నేతల రాజకీయ వ్యూహాన్ని టీడీపీ నేతలు తాము అదే పద్దతిని అనుసరించి ఉంటే బావుండేది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .

ఇదిలా ఉండగా తెలంగాణ సి ఎం కొద్ద్ది రోజులు పరిస్థిని సమీక్షించిన తర్వాతే తన గళం విప్పి మోదీ పిలిపించుకొని సలహాలు తీసుకొనే పరిస్థితికి వచ్చారని ,చంద్ర బాబు వేచి చూసి ఉంటే పరిస్థితి ఇప్పుడు డిఫ్డెన్సు లో పడే ది ఉండేది కాదని పార్టీ శ్రేణుల్లో అభిప్రాయం వచ్చేసింది.

చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్నట్లు కేంద్రం ఆపై అసహనం వ్యక్తం చేస్తున్న బాబు ప్రజల దృష్టిని అటు వైపు మరల్చేందుకు పావులు కదుపుతున్నా ,ప్రజలు వినే పరిస్థితిలో లేరు,మొత్తంగా చంద్రబాబు తన నెత్తిన తానే చెయ్య పెట్టుకున్నట్లయింది , దీర్ఘ కాలిక లాభం వున్నా ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులే లెక్కలోకి వస్తాయి కదా..

Leave a Reply