Posted [relativedate]
తమిళ తంబీలు ఏపీ సీఎం చంద్రబాబుకి గొప్ప చిక్కే తెచ్చిపెట్టారు.చెన్నై కుర్రోళ్ళు సాధించిన జల్లికట్టు ఆర్డినెన్సు తో ఒక్కసారిగా మళ్లీ ప్రత్యేక హోదా ఆశలు చిగురించాయి.దీంతో విశాఖ ఆర్కే బీచ్ వేదికగా మౌన నిరసనకు యువత ముందుకొచ్చింది.వారితో కలిసి పోరాటానికి పవన్ సై అన్నాడు.జగన్ వారికి జై కొట్టాడు.ఈ పరిణామాలు చంద్రబాబుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు జల్లికట్టుకి,ప్రత్యేక హోదాకి పోలికేంటని చిరాకు పడ్డారు.నిజమే ..అది ఓ సాంప్రదాయ క్రీడ మాత్రమే ..ఇది ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలతో ముడి పడ్డ అంశం.కానీ యువత పిలుపుకి పవన్,జగన్ మద్దతు ఇవ్వడం కూడా బాబుకి రుచించలేదు. అందుకే వారిపై పరోక్షంగా ఎదురుదాడికి దిగారు. ఈ వ్యవహారంపై బాబు రియాక్షన్ మీద మీరూ ఓ లుక్ వేయండి.
- ఆ లేఖలేవో ఆనాడు రాస్తే ఇంత సమస్య వుండేది కాదేమో
- మీ స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకోవాలని చూడటం సిగ్గుచేటు
- రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా? అభివృద్ధి జరుగుతుందా?
- ఇప్పుడు మాట్లాడేవాళ్లకు పరిపాలనా అనుభవం వుందా?
- దొంగలెక్కలు రాయడంలో :ఒకాయనకు అనుభవం
- కులాలు, ప్రాంతాలు, మతాలు మధ్య చిచ్చుపెట్టడం కొంతమంది పనిగా మారింది
- ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవన్నీ నెరవేరుస్తున్నాం
- రైళ్లు కాల్చినా భయం లేదు..
- ప్రజల్ని మభ్యపెట్టి ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారు.
- ప్రపంచమంతా మనల్ని గుర్తిస్తూ వుంటే వీళ్లకు ఓర్వలేనితనం
- జీఎస్ డీపీ లెక్కలు ప్రభుత్వం తయారుచేసేవి.. వీటిని దొంగలెక్కలంటే ఏం చేస్తాం.
- వీళ్లకు పంచాయతీ సర్పంచ్ గా చేసిన అనుభవమైనా వుందా
- పనిచేస్తే ఫలితాలు వస్తాయి, పనిచేస్తే గుర్తింపు వస్తుంది. ర్యాంకింగ్స్ వస్తాయి
- విశాఖలో కాగడా పెట్టి తిరుగుతామంటే ఏంటి అర్ధం..? ఇవాళ విశాఖ విశ్వనగరంగా వుంది.
- బాధ్యతతో వుంటాం.. బాధ్యతగా ప్రవర్తిస్తాం.
- తరతరాలుగా వున్న సమస్య కిడ్నీ సమస్య
- ప్రపంచంలో ఎక్కడా లేని ఆధార్ బేస్డ్ చెల్లింపుల విధానం మనదేశంలో తీసుకువచ్చాం.
- మొబైల్ లావాదేవీలు ఇంత విస్తృతంగా జరుగుతున్నది మన దేశంలోనే
- విశాఖపట్టణం సైబర్ సెక్యూరిటీ, ఫిన్ టెక్ వ్యాలీగా రూపొందిస్తున్నాం.
- విజయవాడకు తాగునీరు వచ్చేదా? డెల్టాకు నీళ్లు వచ్చేవా? పోలవరం దశాబ్దాల కల… పనులు కనిపించడం లేదా..?
- ఒక సంవత్సరంలో రెండు నదులు కలిపిన రాష్ట్రం వుందా?
- చేసినా విమర్శిస్తుంటే బాధగా వుంటుంది
- నా ప్రభుత్వంలో ఎవరికీ అన్యాయం జరగడు
- వంశధార విషయంలో అధికారులు చేసిన తప్పిదానికి అక్కడి రైతులకు నేను క్షమాపణ చెబుతున్నా