Posted [relativedate]
ఆరోగ్యశ్రీ గొప్ప పథకమని గొప్పలు చెప్పుకునే జగన్.. చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పథకం చూసి బుద్ధితెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ ఆస్పత్రులు లాభపడితే.. ఇప్పుడు ఆయుష్మాన్ భవలో మాత్రం రోగులకే మేలు జరగనుంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ పేరుతో స్కీమ్ పెట్టారు. ప్రతి ఇంటికీ లబ్ధి కలిగించే పథకమంటూ ఊదరగొట్టారు. ఆరోగ్యశ్రీ పేరుతో పేద రోగులకు లబ్ధి కలిగిన మాట నిజమే అయినా.. తెర వెనుక జరిగిన దోపిడీ లేటుగా బయటపడింది. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు దోచిపెట్టడానికే ఈ పథకం డిజైన్ చేశారని తర్వాత బయటపడింది. మామూలుగా ఇరవై వేలయ్యే ఆపరేషన్లకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద 40వేల బిల్లు వసూలు చేసిన ఆస్పత్రులు.. బాగా లాభపడ్డాయి. ఆరోగ్య శ్రీ పైత్యం ఎంత ముదిరిందంటే.. ఆ కేసుల మీదే ఆధారపడి నడుస్తున్న ఆస్పత్రులు వందల్లో ఉన్నాయి.
నిజానికి ఆరోగ్యశ్రీ కింద వేల కోట్ల రూపాయల నిధులిచ్చారు. దీంతో చిన్న నర్సింగ్ హోం లు కూడా రోగుల కార్డుల నుంచి ఇబ్బడిముబ్బడిగా డబ్బులు కట్ చేసుకుని.. ఏడాదిలోనే పెద్ద బిల్డింగులు కట్టి కార్పొరేట్ ఆస్పత్రులుగా ఎదిగాయి. ఇవేమీ తెలియని రోగులు మాత్రం చిన్న రోగానికి కూడా భారీ ఫీజు సమర్పించుకున్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఏపీ సర్కారు ఆయుష్మాన్ భవ స్కీన్ డిజైన్ చేసింది. దాదాపు ముప్ఫై రకాల వ్యాధులు, వాటి పరీక్షలు ఉచితంగా చేస్తామని చెబుతూ.. 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు తెరిచింది. ఇక్కడ ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులో ఉండటమే కాకుండా.. అవసరమైతే నిపుణులతో టెలిమెడిసిన్ సేవలు కూడా ఉన్నాయి.
నిజమైన ప్రజాక్షేమాన్ని కోరుకునే సర్కారు ఎప్పుడూ ప్రభుత్వరంగాన్ని బలోపేతం చేయాలి. ప్రైవేట్ రంగానికి రాయితీలివ్వాలే కానీ.. దోచిపెట్టకూడదు. కానీ వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం ప్రైవేట్ ఆస్పత్రులకు అనుకోని వరంగా మారింది. అందుకే ఈ కేసులకు ముకుతాడు వేయాలని భావించిన చంద్రబాబు.. ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలకు రూపకల్పన చేశారు. సమర్థవంతమైన పాలకుడిగా ప్రతి పనిగా జవాబుదారీ తనం కోలుకునే చంద్రబాబు.. ఇక్కడ కూడా ఎలాంటి అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్నీ ఉచితమే కాబట్టి డాక్టర్లు తోక జాడించే అవకాశం లేకుండా పోయింది. దటీజ్ చంద్రబాబు.