బాబుకి పరీక్ష..కెసిఆర్ కి ఆట

 chandrababu kcr meet together water resources purpose
ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారానికి ఢిల్లీలో జరగబోతున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆసక్తి రేపుతోంది.కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్ గా వ్యవహరించే ఈ కౌన్సిల్ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా వుంటారు.ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పై దృష్టి సారించిన కేంద్రం సెప్టెంబర్ 21 న ఢిల్లీలోఇద్దరు సీఎం ల భేటీకి ఏర్పాట్లు చేసింది.విభజన కి ముందు తరువాత సైతం ఉప్పునిప్పు లా ఉంటున్న బాబు,కెసిఆర్ ఓ సమస్యపై నేరుగా సమావేశం కావడం ఇదే మొదలు.అయితే సబ్జెక్టు పరంగా చూస్తే నదీజలాల అంశంలో కెసిఆర్ కి ఉన్నంత పట్టు చంద్రబాబుకి లేదనే చెప్పుకోవాలి.పైగా ఎప్పటిలాగానే పట్టిసీమ సహా వివిధ అంశాలపై ఏపీ మీద ఫిర్యాదు చేయడానికి కెసిఆర్ రెడీ అయిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.పోతిరెడ్డిపాడు వివాదంపై ఆంధ్రాకి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించామని తెలంగాణ వర్గాలు చెబుతున్నాయి .

ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ని నిలువరించడం మీద చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు.పైకి చెప్పకపోయినా దఫదఫాలుగా సంబంధిత అధికారులతో బాబు సమావేశమై కసరత్తు చేస్తున్నారు.ఉమాభారతి సమక్షంలో కెసిఆర్ కి గట్టి కౌంటర్ ఇవ్వడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని బాబు ఆలోచన.అయితే ఆయనకు ఇంగ్లీష్,హిందీ భాషల్లో ఉన్న ఇబ్బందిరీత్యా చూసినా..అపెక్స్ కౌన్సిల్ సమావేశం బాబుకి పరీక్ష.. కెసిఆర్ కి ఆట అని చెప్పక తప్పదు.

SHARE