విజయవాడకి చంద్రబాబు..

  chandrababu meet uma bharathi come back vijayawada

ఐదు రోజుల చైనా పర్యటన.. వెను వెంటనే ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ.. ఇవన్నీ ముగించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి కిందట విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు ఘనస్వాగతం పలికారు..

cm hom

The Union Minister for Water Resources, River Development and Ganga Rejuvenation, Sushri Uma Bharati meeting the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu, in New Delhi on August 26, 2014.

ఢిల్లీలో చంద్రబాబు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జెట్లీ తో సమావేశమయ్యారు. రాష్రాన్ని రావలసిన నిధులు గురించి అడిగారు.. రాజధానికి రాబోవు మూడేళ్ళలో 3 వేల కోట్లు ఇవ్వాలని అడిగారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, జనవనరుల శాఖ మంత్రి ఉమా భారతి తో కూడా సమావేశమై విభజన హామీల గురించి చర్చించారు..

కేంద్రం నుంచి సానుకూల స్పందన వ్యక్తం అయ్యిందని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నప్పటికీ .. ఏదైనా పూర్తి ఫలితం వచ్చేదాకా నమ్మే పరిస్థితి లేదని గత అనుభవాలు చెప్తున్నాయి.. చూద్దాం..! ఈ సారి కేంద్రం ఏంచేస్తుందో .?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here