ఏపీ మంత్రిమండలి సమావేశం… ఎందుకంటే.?

 chandrababu meeting with ap ministers vijayawada

ఈ నెల నుంచి 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విజయవాడలో ప్రారంభమైంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శాసనసభ సమావేశాలు, రాయలసీమ కరువు, పుష్కరాలు తదితర అంశాలపై చర్చినున్నారు. జీఎస్టీ సవరణ బిల్లును మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించనుంది.

అలాగే ‘ఓటుకు కోట్లు’ కేసును ప్రతిపక్షం లేవనెత్తితే ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపైనా కేబినెట్ చర్చించనుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతుంది. ఇక సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ వ్యూహ కమిటీ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు.

SHARE