అమరావతికి కొంగొత్త సొగసులు ఇవే ..

 Posted October 27, 2016

chandrababu meeting with crda officers about amaravati development
అమరావతి నిర్మాణంపై crda అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.నిర్మాణ పనుల్లో అనుసరించాల్సిన విధానాలపై కొన్ని సూచనలు చేశారు. అమరావతికి సరికొత్త శోభ తెచ్చే ప్రతిపాదనలు కూడా చేశారు బాబు..

1. ప్రకాశం బ్యారేజ్ కి ఇవతలి వైపు కొండపై దుర్గమ్మ కొలువుంది.బ్యారేజ్ రెండో వైపు కొండభాగంలో భారీ బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయాలని బాబు ఆలోచిస్తున్నారు.
2.రాజధాని ప్రాంతంలో ఓ పదెకరాల్లో హస్తకళల గ్రామాన్ని ఏర్పాటుకి ముందుకొచ్చిన మహిళల్ని ప్రోత్సహించాలని బాబు భావిస్తున్నారు.
3 . టీటీడీ నిర్మించే వెంకటేశ్వర స్వామి ఆలయం,ఇస్కాన్ సారధ్యంలో ఏర్పాటయ్యే కృష్ణ మందిరంతో పాటు మసీద్,చర్చి నిర్మాణం చేసి అన్ని వర్గాల సందర్శనీయ ప్రాంతంగా అమరావతిని అభివృద్ధి చేయాలని బాబు అధికారులకి నిర్దేశించారు.
4.రాజధానిలో నిర్మించే భవంతులు,కట్టడాలకు ఏకరూపత వుండాలని..ఆ నిర్మాణ శైలి ఆంధ్ర ప్రదేశ్ కళలు,బౌద్ధ సంస్కృతులు ఉట్టిపడేలా చూడాలని బాబు ఆదేశించారు.
5. భవిష్యత్ లో వాస్తు దోష ప్రస్తావన రాకుండా వాస్తు శాస్త్ర ప్రముఖులతో ఓ కమిటీ వేయాలని బాబు భావిస్తున్నారు.

SHARE