రామోజీ ఇంటికి బాబు ..

Posted February 3, 2017

chandrababu meets ramoji rao in home
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు ఇంటికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు.హైదరాబాద్ వచ్చిన ఆయన తొలుత బావమరిది రామకృష్ణ ఇంటిలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారు.ఆ తరువాత అనారోగ్యంతో కొన్నాళ్లుగా బేగం పేట ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న రామోజీరావు వద్దకు బాబు వెళ్లారు.ఆయన్ని పరామర్శించి కొంతసేపు అక్కడే గడిపారు.ఆరోగ్యం గురించి రామోజీని అడిగి తెలుసుకున్న బాబు పని ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది.

ఇటీవల అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో రామోజీ చికిత్స పొందారు.తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు కూడా రామోజీని పరామర్శించి వెళ్లారు.రాజకీయంగా రామోజీ సలహాలు పాటిస్తారని భావించే బాబు స్వయంగా రావడంతో పాలిటిక్స్ గురించి కూడా ఏదైనా చర్చ జరిగే అవకాశాలు లేకపోలేదు.అయితే ఆ భేటీలో మరెవరు లేకపోవడంతో అక్కడ చర్చ పరామర్శలతో ఆగిపోయిందా ..ఇంకా ముందుకెళ్ళిందా అనేది ఇప్పట్లో చెప్పలేం.

SHARE