Posted [relativedate]
నిన్నటి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందట.ఓ సభ్యుడు గాలి పంచుతున్న ఈ శుభలేఖ …దానికి అవుతున్న ఖర్చు గురించి చెప్పారట.ఆయన్ని విషయం చెప్పనిచ్చి మిగతా సభ్యులు కూడా జైలుకి వెళ్లొచ్చి కూడా ఇంత ఆర్భాటం చేస్తున్నారంటే ఎంత బరితెగింపో అని అన్నారట.
అవినీతి డబ్బుతో చేసే ఇలాంటి పెళ్లిళ్లు సమాజానికి చెడు సంకేతాలు పంపుతున్నాయని పొలిట్ బ్యూరో లో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.అప్పటిదాకా మౌనంగా సభ్యులు చెప్పిన మాటలు విన్న బాబు ఆ టాపిక్ లోపలికి వెళ్లకుండా అందుకే తాను 500,1000 నోట్లు నిషేధించాలని కోరుతున్నట్టు చెప్పారు.అంటే ఆ నోట్ల రూపంలో గాలి దగ్గర బ్లాక్ మనీ ఉందని బాబు చెప్పకనే చెప్పారు.ఎంతైనా సీనియర్ నేత కదా!