బాబు వారసురాలు బ్రాహ్మణి?

 Posted October 20, 2016

chandrababu naidu after next ap cm brahmani
ఏపీ రాజకీయాల మాటెలా వున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది.అయన కూడా ఇటీవల కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలని నేతలు,అధికారులకి కూడా హితబోధ చేయడం చూస్తున్నాం.కుటుంబం పరిస్థితి బాగుంటేనే కదా ఆ సంతోషంతో ఇలాంటి మాటలు చెప్పేది.. కానీ మరో ఆరునెలల్లో బాబు కుటుంబ పరిస్థితులు మారిపోతాయంటున్నారు ఓ జ్యోతిష్కుడు..పేరు పరాంకుశం వేణు స్వామి.

2017 ఫిబ్రవరి లో అనారోగ్యం వల్ల బాబు అధికారానికి దూరం అవుతారని …అప్పుడు ఓ మహిళ వల్ల కుటుంబంలో కూడా స్పర్ధలు తప్పవని అయన అంటున్నారు.జాతకరీత్యా చూస్తే బాబు వారసురాలిగా బాలయ్య లేదా బ్రాహ్మణి సీఎం పీఠాన్ని అధిష్టించే అవకాశాలున్నాయని వేణు స్వామి జోస్యం.ఆ ఇద్దరిలో కూడా బ్రాహ్మణికే అవకాశాలు ఎక్కువని …బాబు కూడా ఆమె వైపే మొగ్గుతారని అయన చెప్తున్నారు.లోకేష్ తో పోలిస్తే బ్రాహ్మణి రాజయోగం బలమైందని కూడా ఓ ఆన్ లైన్ టీవీ లో సదరు జ్యోతిష్కుడు సెలవిచ్చాడు.ఇది ఆ స్వామి ఊహా?లేక జోస్యమా? అన్నది మరో ఆరు నెలల్లో తేలిపోతుంది.

SHARE