చంద్రబాబు కి నంద్యాల సవాలు

Posted April 13, 2017

 chandrababu nandyala stumble

గతంలో ఎన్నో సంక్షోభాలను ఎంతో సులువుగా ఎదుర్కున్న చంద్రబాబుకి. ఇది పెద్ద లెక్క కాదనేది తమ్ముళ్ల భావన. శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ అండతో ఎదిగారే కానీ.. సొంతంగా ఆయనకు నంద్యాలలో బలం లేదు. టీడీపీని వీడతానని బెదిరిస్తున్నా అది తాటాకు చప్పుడేనని తమ్ముళ్ల భావన. ఇక మాజీ మంత్రి ఫరూఖ్ కు చంద్రబాబు దగ్గర సాన్నిహిత్యం ఉంది. బాబు ఏం చెప్పినా ఆయన కాదనే పరిస్థితి లేదు. మొన్న కూడా ఫరూఖ్ పార్టీని వీడతారని ఆయన అనుచరులు చెప్పారు కానీ.. ఫరూఖ్ నోరు జారలేదు.

ఇక ఎంపీ ఎస్పీవైరెడ్డికి బిజినెస్ ముఖ్యం. అల్లుడికి టికెట్ కోసం టీడీపీలో దక్కుతున్న వెసులుబాటును ఆయన కాదనుకునే పరిస్థితి లేదు. ఎటొచ్చి భూమా కుటుంబమే టికెట్ కోసం తేల్చుకోవాలనేది చంద్రబాబు సన్నిహితుల మాట. ఆ కుటుంబం నుంచి ప్రధాన పోటీదారాలుగా భూమా అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డి.. నాగిరెడ్డి రెండో కూతురు మౌనికా రెడ్డి బరిలో ఉన్నారు. బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇవ్వడం అఖిలప్రియకు ఇష్టం లేదనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. మౌనికారెడ్డికే టికెట్ దక్కుతుందని అనుకుంటున్నారు.

SHARE