బాబు క్యాబినెట్ లో రెడ్లకి పెద్ద పీట?

 chandrababu new cabinet priority reddy categories
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇష్టమున్నా లేకున్నా అక్కడ రాజకీయం చేయాలంటే కులాల మీద కసరత్తు తప్పదు.ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే కోవలో ఓ ప్రయోగం చేయబోతున్నట్టు తెలుస్తోంది.క్యాబినెట్ విస్తరణ అందుకు వేదిక అవుతోంది.2014 ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలకు గాను 8.5 చోట్ల టీడీపీ మెరుగైన ఫలితాలు సాధించగా …వైసీపీ 4.5 జిల్లాల్లో బాగా పెర్ఫార్మన్స్ చేసింది.ఆ అర్ధ జిల్లా ప్రకాశం సగభాగం.నెల్లూరు,కడప,కర్నూల్,చిత్తూరు లో వైసీపీ కి సీట్లు ఎక్కువొచ్చాయి.ఇప్పుడు అదే ప్రాంతాలపై బాబు కన్ను పడింది.వచ్చే ఎన్నికల్లో ఆ ప్రాంతాల్లోపట్టు సాధించేందుకు బాబు ఓ స్కెచ్ వేశారు.

వైసీపీ కి బలమున్న చోట్ల ఆ పార్టీకి అండగా ఉంటున్న రెడ్లు సామాజికంగా,రాజకీయంగా గట్టి పట్టు కలిగి వున్నారు.ఇప్పుడిప్పుడే జగన్ సామర్ధ్యం పై సందేహ పడుతున్న ఆ సామాజిక వర్గానికి చేరువకావాలని బాబు భావిస్తున్నారు.జనసేన ఎంట్రీ కూడా ఖరారు కావడంతో ప్రత్యామ్న్యాయ శక్తుల్ని అక్కున చేర్చుకోడానికి బాబు డిసైడ్ అయ్యారు.తొలిదశలో క్యాబినెట్ విస్తరణతో ఆ సామాజికవర్గానికి ఓ ఫీలర్ పంపదలుచుకున్నట్టు తెలుస్తోంది.అందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి,నెల్లూరు నుంచి సోమిరెడ్డికి ,కర్నూలు నుంచి భూమాకి,కడప నుంచి సతీష్ కుమార్ రెడ్డి కి మంత్రివర్గం లో స్థానం కల్పించే అవకాశమున్నట్టు సమాచారం.చిత్తూరు విషయంలో ఎవరిని ప్రోత్సహించాలన్నదానిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది.బాబు ప్లాన్ అమల్లోకి వస్తే జగన్ కి మరో సవాల్ ఎదురైనట్టే !

SHARE