కోడలికి బాబు అప్పజెప్పిన కొత్త బాధ్యత ఇదే ..

0
2536
chandrababu-new-responsibulity-to-his-daughter-in-law

Posted [relativedate]

chandrababu-new-responsibulity-to-his-daughter-in-law
తెలుగుదేశం లో లోకేష్ పాత్ర గురించి విమర్శలొస్తున్న తరుణంలోనే అయన భార్య బ్రాహ్మణి కూడా యాక్టివ్ అవుతున్నారు.ఇటీవల ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలొస్తే అన్న కోణం లో ఆమె ఆధ్వర్యంలో ఓ సర్వే జరిగిందట.అందులో ప్రశ్నలు రూపొందించిన విధానం …సర్వే నిర్వహించిన తీరు …బృందాన్ని నడిపిన వ్యవహారశైలి చూసి చంద్రబాబు ఇంప్రెస్ అయ్యారంట.పైగా అప్పటినుంచి పార్టీకి సంబంధించిన మరికొన్ని బాధ్యతలు తీసుకోమని అయన బ్రాహ్మణి మీద ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది.దీంతో ఆమె ఇక పార్టీ బాధ్యతల్లో క్రియాశీలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారట.

ఇప్పుడు మామ చెప్పినట్టు బ్రాహ్మణి పార్టీ డ్యూటీ మొదలెట్టారట.టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె పర్యవేక్షిస్తున్నారట.ఈసారి టార్గెట్ చేరకపోతే పార్టీ లో తనకి డిమోషన్ తప్పదని లోకేష్ సరదాగా అన్న సంగతి తెలిసిందే..అయితే ఆ పరిస్థితి రాకుండా బ్రాహ్మణి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరు మీద ఆమె నిరంతరం దృష్టి పెట్టారు.సమస్యలున్న చోట ఆమె స్వయంగా ఎమ్మెల్యేలు,పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడుతున్నారట.ఇక గుంటూరు జిల్లా మీద బ్రాహ్మణి స్పెషల్ కేర్ తీసుకుని సభ్యత్వ నమోదు మీద నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.కోడలు కొత్త బాధ్యతలు నిర్వహిస్తున్న తీరుపై బాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వున్నారు.

Leave a Reply