డిగ్రీ సబ్జెక్టు దెబ్బకి మంత్రి పదవి హుళక్కే..

Posted [relativedate]

chandrababu not giving minister post to jalil khan
జ్ఞానం లేకపోయినా ఫర్లేదు కానీ మన అజ్ఞానాన్ని బయటపడకుండా కాసింత మౌనంగా ఉండటం ఎంత అవసరమో ఆ ఎమ్మెల్యేకి అర్ధమైంది.అయితే అప్పటికే జరిగిన నష్టం అపారం. ఎదురు వస్తుందనుకున్న మంత్రి పదవి హుళక్కు అయినట్టే కనిపిస్తోంది.ఆ ఎమ్మెల్యే ఇంకెవరో కాదు. బీకామ్ లో ఫిజిక్స్ చదివానంటూ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిపోయిన జలీల్ ఖాన్.ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ ఖాన్ ఫేట్ మార్చేసింది.ఆయన పాపులారిటీ పెరిగింది కానీ పదవి,పరువు పోయాయి.మంత్రి పదవి కోసమే వైసీపీ నుంచి ఆయన టీడీపీ లోకి వచ్చారు.జగన్ మీద విరుచుకుపడడం చూసి ముచ్చటపడ్డ బాబు కూడా ఆయన కోరిక తీరుద్దామనుకున్నారు.

ఇంతలో బీకామ్ లో ఫిజిక్స్ ఉందంటూ జలీల్ ఇచ్చిన ఇంటర్వ్యూ బయటికి రావడం,అది సోషల్ మీడియా ద్వారా విస్తృతం కావడం తో బాబు పునరాలోచనలో పడ్డారు.అసలే ఇలాంటి భయాలు ఎక్కువ వుండే బాబు ..ఏమీ తెలియని వారికి మంత్రి పదవి ఇచ్చారనే విమర్శకి అవకాశం ఇచ్చేలా లేరు.ఈ స్థానంలో ఇటీవలే పార్టీలోకి వచ్చిన గుంటూరు నేత మొహమ్మద్ జానీ పేరు వినిపిస్తోంది.ఏదేమైనా తెలియని విషయం మీద నోరు జారినందుకు జలీల్ ఇప్పుడు బాగా మధనపడిపోతున్నాడంట.ఆ రోజు మౌనం వహిస్తే మంత్రి పదవి వచ్చేది కదా అనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడంట.పైగా అప్పటినుంచి పెద్దగా బయటికి రావడానికి కూడా ఇష్టపడడం లేదంట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here