మోడీని బాబు అడిగేది ఈ రెండేనా ?

  chandrababu phone call modi
చంద్రబాబు ప్రత్యేకహోదా డిమాండ్ కి కేంద్రం ప్యాకేజ్ తో సమాధానం ఇచ్చింది.తప్పని సరి పరిస్థితుల్లో అయన కూడా అందుకు ఓకే చెప్పారు.అప్పుడు బీజేపీ ఢిల్లీ రమ్మని పిలిచినా వెళ్లని బాబు ఇప్పుడు స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేసి థాంక్స్ చెప్పారు.త్వరలో ఢిల్లీ వచ్చి కలుస్తానని చెప్పారు.బాబు ఇలా మారిపోడానికి కేంద్రం ముందు అయన పెట్టిన ఓ డిమాండ్..అందుకు దక్కిన హామీ అని తెలుస్తోంది.ఇంతకీ ఆ హామీ నియోజకవర్గాల పునర్విభజన.

ప్రస్తుతం Ap లో ఉన్న 175 స్థానాల్ని 225 కి పెంచడం కేంద్రం చేతుల్లో వుంది.2019 కి ముందు నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని చెప్పిన కేంద్రం …బాబు వినతికి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియను హోమ్ శాఖ ప్రారంభిస్తుందని ఢిల్లీ సర్కిల్స్ నుంచి వస్తున్న మాట.బాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీని ప్యాకేజ్ కి చట్టబద్ధత,నియోజకవరాల పెంపు గురించి మరోసారి అడుగుతారట.ఇంతకుముందు వచ్చిన హామీని మళ్లీ గుర్తు చేస్తారన్నమాట.మోడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాబుతో పాటు కెసిఆర్ కూడా హ్యాపీ ..

SHARE