పులివెందులలో చీలిక తెస్తున్న టీడీపీ?

 Posted April 1, 2017

chandrababu plan to expand jagan pulivendula constituency
దశాబ్దాలుగా వై.ఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటున్న పులివెందులలో పాగా వేయడానికి టీడీపీ చేయని ప్రయత్నం లేదు..వేయని ఎత్తు లేదు.కానీ వాటిలో ఏ ఒక్కటీ ఫలించలేదు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ఆపలేదు.తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ సొంత బాబాయ్ వివేకాని మట్టికరిపించిన ఊపుతో మరో ప్లాన్ వేస్తోంది టీడీపీ.వై.ఎస్ కుటుంబానికి కంచుకోటైన పులివెందులని బద్దలు కొడుతోంది. అక్కడ చీలిక తెస్తోంది.జగన్ ని డిఫెన్స్ లో పడేసే ప్లాన్ ఒకటి సిద్ధం చేసింది.నియోజక వర్గాల పునర్విభజన ని అస్త్రంగా మలుచుకుంటోంది.

2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అప్పుడు అధికారంలో వున్న కాంగ్రెస్ కి కలిసి వచ్చింది.ఇటు రాష్ట్రం,అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో నియోజక వర్గాలకి సంబంధించి జరిగిన మార్పులు,చేర్పుల్లో ఆ పార్టీకి అనుకూలంగా ఉండేలా కొన్ని చర్యలు తీసుకోడానికి వీలైంది.అప్పట్లో ఈ బాధ్యతను సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి,జేడీ శీలం కాంగ్రెస్ తరపున పర్యవేక్షించారు.అప్పటికప్పుడు వీరి చర్యలతో ఏమి జరిగిందో తెలియకపోయినా ఎన్నికల ఫలితాలు వచ్చాక పునర్విభజన ప్రక్రియ కాంగ్రెస్ కి ఎంత ఉపయోగపడిందో అర్ధమైంది.ఇప్పుడు టీడీపీ కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాలి అనుకుంటోంది. మరీ ముఖ్యంగా జగన్ బలాన్ని పులివెందులలో కకావికలం చేసేలా ప్లాన్ చేస్తోంది.స్థానిక పరిస్థితుల మీద పూర్తి అవగాహన వున్న సతీష్ రెడ్డి లాంటి వాళ్ళని రంగంలోకి దించి,ఏ ఏ మండలాల్లోఎవరి బలమెంతో ఓ అంచనా వేసుకుని..దానికి అనుగుణంగా జగన్ ని వీక్ చేసేలా పులివెందుల నియోజకవర్గాన్ని చీల్చడానికి వ్యూహరచన చేస్తున్నారు.వీళ్ళ ప్లానింగ్ తెలిసి జగన్ కూడా కంగారు పడుతున్నాడు.అయితే ఈ మొత్తం జరగాలంటే ముందు అసలు నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కధని ముందుకు నడిపించాలి కదా..

SHARE