కుడి ఎడమైన గంటా,నారాయణ స్థానాలు?

Posted March 20, 2017

chandrababu praise to ganta srinivasa rao and angry on narayana after mlc elections results
ఆ ఇద్దరూ చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు..వియ్యంకులు కూడా.అయితే స్థానిక సంస్థల ఎన్నికల ముందు..ఫలితాల తర్వాత వారి స్థానాల్లో మార్పు వచ్చింది.కుడి ఎడమ అయ్యేలా వుంది. సీఎం చంద్రబాబుకి నారాయణ కుడి భుజం అని వేరే చెప్పక్కర్లేదు.ఇక గంటా వ్యవహారశైలిమీద బాబు,లోకేష్ చిటపటలాడుతున్నారని ఏడాదిగా వార్తలు వస్తూనే వున్నాయి.అయితే అదంతా గతం. ఒక్క ఎన్నిక మొత్తాన్ని మార్చేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు మంత్రులకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు సీఎం.కడపలో జగన్ ని మట్టికరిపించడంలో సక్సెస్ అయిన గంటా మైనస్ నుంచి ప్లస్ లోకి వచ్చేస్తే,నెల్లూరు లో పార్టీని గెలిపించినా మెజారిటీ తగ్గడంతో నారాయణ సీన్ రివర్స్ అయ్యేట్టుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అసెంబ్లీ లోని సీఎం కార్యాలయంలో మిఠాయిలు పంచుకున్నారు.అక్కడికి వచ్చిన నాయకుల మధ్యనే గంటాని సీఎం ప్రశంసలతో ముంచెత్తారు. కడపలో పార్టీ గెలుపుకి నీ కష్టమే పని చేసిందని గంటాని పొగిడారు బాబు.దీంతో క్యాబినెట్ విస్తరణలో గంటా ప్లేస్ సేఫ్ అని తేలిపోయింది.అదే టైం లో బాబు కుడిభుజంగా వుండే నారాయణ సారధ్యంలో సాగిన నెల్లూరు ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ కి దాదాపు 45 ఓట్లు క్రాస్ అయ్యాయి. దీంతో టీడీపీ అభ్యర్థి వాకాటి మెజారిటీ తగ్గింది. నారాయణ వ్యవహారశైలి వల్లే ఈ నష్టం జరిగిందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.అదే విషయాన్ని బాబుకి ఫిర్యాదు చేయబోతున్నాయి.మొత్తానికి వియ్యంకులైన ఈ ఇద్దరి నేతల స్థానాల్ని ఈ ఎన్నికలు మార్చేస్తున్నట్టుంది.

SHARE