ఆ ఇద్దరికీ బాబు భరోసా..

  chandrababu promised bode prasad and vallabhaneni vamsi
దేవినేని నెహ్రు తెలుగుదేశం లోకి ప్రవేశంతో ..అయన వ్యతిరేకులు కంగారు పడుతున్నారు.ముఖ్యంగా టీడీపీ నాయకులు ఆయన రాక తమకి ఎర్త్ పెట్టొచ్చని ఆందోళన చెందుతున్నారు.ఈ విషయం ఆ నోటాఈనోటా పడి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకెళ్ళింది.వారి పరిస్థితిని అర్ధం చేసుకున్న అయన స్వయంగా పెనమలూరు mla బోడె ప్రసాద్,గన్నవరం mla వల్లభనేని వంశీని పిలిపించుకున్నారు.

ఆ ఇద్దరు గతంలో నెహ్రూకి వ్యతిరేకంగా పార్టీ కోసం నిలబడిన వాళ్లే.నెహ్రు రాకతో ఆందోళన చెందాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు.మీ నియోజకవర్గాల్లో ఎవరి జోక్యం ఉండదని వారికి నచ్చజెప్పారు.వచ్చే ఎన్నికల్లో సీటు విషయం గురించి కూడా బుర్ర బద్దలు కొట్టుకోకుండా పని చేసుకుంటూ వెళ్లాలని సీఎం వారికి సూచించారు.బాబు భరోసాతో ఆ ఇద్దరు హ్యాపీ గా కనిపించారు.

SHARE