జగన్ వైఫల్యమే బాబు ధైర్యమా?

  chandrababu public announcement take package because jagan fault
ప్రత్యేకహోదా ని పక్కనబెట్టి ప్యాకేజ్ కి జై కొట్టాలంటే జనం స్పందన ఎలా ఉంటుందోనని సీఎం చంద్రబాబు చాన్నాళ్లు తర్జనభర్జన పడ్డారు.చివరికి స్వతహాగా వుండే భయాన్ని కాదనుకుని ధైర్యంగా ప్యాకేజ్ కి ఒప్పుకున్నట్టు బాబు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.ఆవేశానికి తేలిగ్గా లోనయ్యే యువకులు వుండే చోట బాబే స్వయంగా ప్యాకేజ్ ప్రస్తావన తెచ్చి మరీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పారు.ఇంత ధైర్యం బాబుకి ఎలా వచ్చిందా అని దేశం శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి.

బాబు దూకుడు వెనుక ఏముందా అని ఆరా తీస్తే జగన్ వైఫల్యం ఉన్నట్టు తెలిసింది.కేంద్ర ప్రకటన తరువాత వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపు సక్సెస్ కాకపోవడం బాబుకి ధైర్యం తెచ్చింది.జనంలో హోదా సెంటి మెంట్ వున్నా దాని వల్ల ప్యాకేజ్ కన్నా ఎక్కువ ప్రయోజనాలు వుంటాయని చెప్పడంలో జగన్ ఫెయిల్ అయ్యారు.ఆయన స్వయంగా దీనిపై కసరత్తు చేసినట్టు ఎక్కడా మాట్లాడలేకపోయారు.మరో వైపు వెంకయ్య సహా కేంద్ర మంత్రులు చెప్పిన గణాంకాలు జనాల్లోకి వెళ్లడంతో బాబు ధైర్యంగా ముందుకెళ్లారు.జగన్ వైఫల్యాన్ని వాడుకుని తేలిగ్గా హోదా గండం గట్టెక్కారు.

SHARE