Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు పెట్టింది పేరు అని చంద్రబాబు చెప్పని వేదిక లేదు. ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణ పాఠాలను పెద్దబాలశిక్షలాగా పాటిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో తమ్ముళ్లు కట్టు తప్పుతున్నారు. స్వయంగా అధినేత తలంటినా వినకుండా.. ఎక్స్ ట్రాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో ఉండి ప్రజాసేవ చేయకుండా.. పార్టీ పరువు తీస్తున్నారు.
వైసీపీ మీద ఆధిపత్యం కోసం టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కొన్నిచోట్ల రివర్సైంది. పైకి నేతలు కలిసినట్లు కనిపించినా.. క్షేత్రస్థాయిలో క్యాడర్ మాత్రం కలవడం లేదు. ప్రకాశం జిల్లా అద్దంకిలోనే కాదు.. వైసీపీ ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. అయితే బాబు సొంత జిల్లా చిత్తూరులోని అమర్ నాథ్ రెడ్డి నియోజకవర్గం మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది.
ఎమ్మెల్యే గొట్టిపాటి రవి చొక్కొచించి కింద పడేసి కొట్టేంత వరకు కరణం బలరాం వర్గం బరితెగించిందంటే ఇరు వర్గాల మధ్య రాజకీయ కక్షలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమవుతోంది. దీన్ని చంద్రబాబు ఏ విధంగా సర్ధిచెప్పినా వినే పరిస్థితుల్లో అక్కడి కార్యకర్తలు లేరు. కానీ ఇందుకోసం బాబు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే గొట్టిపాటి, కరణం వర్గాలకు దిమ్మతిరిగే షాకిస్తారనే మాట వినిపిస్తోంది.