బాబుకి ఎన్టీఆర్ అందుకే కూతురిని ఇచ్చాడా?

0
847
chandrababu reveals how to married ntr daughter bhuvaneswari

 Posted [relativedate]

chandrababu reveals how to married ntr daughter bhuvaneswari
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చారు.మరి ఆయన భార్య భువనేశ్వరి అప్పటికే ఫిలిం ఇండస్ట్రీ లో మకుటం లేని మహారాజుగా వెలిగిపోతున్న ఎన్టీఆర్ కుమార్తె.ఆ ఇద్దరికీ పెళ్లి ఎలా అయిందన్న దానిపై ఇప్పటికే చాలా సార్లు బాబు చెప్పారు.ఈరోజు అసెంబ్లీ మళ్లీ ఆ ప్రస్తావన వచ్చింది.తాను ఎన్టీఆర్ అల్లుడు కావడానికి ప్రధాన కారణం ఏంటో బాబు వివరించారు.

సాధారణ మధ్య తరగతి నుంచి వచ్చినప్పటికీ రాజకీయంగా ఎదగడాన్ని చూసిన ఎన్టీఆర్ స్వయంగా మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని తనని అడిగినట్టు బాబు అసెంబ్లీ లో వివరించారు. రాజకీయాల్లో ఎంతగా మమేకమైనా కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తున్నట్టు చెప్పారు బాబు. పూర్తిగా రాజకీయం మీదే ఆధారపడితే ఆర్ధిక అభద్రత కలగొచ్చని భావించి 25 ఏళ్ల కిందటే హెరిటేజ్ పెట్టినట్టు బాబు వివరించారు.తాను ఒక్క ఏడాది మాత్రమే దాని గురించి పట్టించుకుంటే 24 ఏళ్లుగా ఆ బాధ్యత భువనేశ్వరి చేస్తున్నట్టు బాబు చెప్పారు.

Leave a Reply