వరదలపై బాబు.. బుల్లెట్ పాయింట్స్

  chandrababu said flood affected people

• కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడిన వివరాలు :

• అకాల వర్షాలు, అధిక వర్షపాతం వరదలకు దారితీసి ఇబ్బందులు తలెత్తాయి : సీఎం

• పులిచింతలకు 4 లక్షల క్యూసెక్కులు వరద నీరు వస్తుంది.. ఒక్కరోజులో 40 టీఎంసీల నీరు వస్తుంది.. అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశాం : సీఎం

• పులిచింతలలో 30 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నాం.. అంతకు మించి వచ్చే నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం : సీఎం

• గుంటూరు జిల్లా గురజాలలో 6 మండలాల పరిధిలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. నల్గొండ సూర్యాపేటలో కూడా భారీవర్షం కురవడంతో పులిచింతలకు వరద నీరు వస్తుంది : సీఎం

• గుంటూరు జిల్లాలో ఊటుకూరు వాగులో చిక్కుకున్న 35 మందిని రక్షించాం : సీఎం

• ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ను, 2 హెలికాఫ్టర్లను సిద్ధం చేశాం : సీఎం

• వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడం, ప్రాణనష్టం లేకుండా చూడడం, ఆస్తి నష్టం లేకుండా చూడడమే తమ ముందున్న కర్తవ్యం : సీఎం

• భారీ వర్షాలు, వరదలు ఉన్న ప్రాంతాల్లో బియ్యం, నిత్యావసరాలు అందిస్తాం : సీఎం

• రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులు, సూయిజ్ ల గేట్లు సక్రమంగా ఉన్నాయో, లేదో.. పరిశీలించమని ఆధికారులకు ఆదేశాలిచ్చాం : సీఎం

• అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేసి రియల్ టైమ్ అసెస్ మెంట్ చేయాలని ఆదేశించాం : సీఎం

• భవిష్యత్తులో ఎంత వర్షం పడినా ఇబ్బందులు తలెత్తకుండా కాజ్ వే లు అన్నింటినీ విస్తరించబోతున్నాం : సీఎం

• ప్లాష్ ప్లడ్ లో వాహనాలు చిక్కుకోకుండా కొన్ని గంటల పాటు వాహనాలను నిలిపివేస్తాం : సీఎం

• రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ప్రభుత్వానికి సహకరించాలి : సీఎం

• జిల్లా స్థాయి, డివిజన్ స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో వర్షాల సమాచారం ప్రజలకు ముందుగానే అందిస్తాం : సీఎం

• 24వ తేదీన దోమలపై దండయాత్ర కార్యక్రమం జరుగుతుంది.. మార్పు లేదు : సీఎం చంద్రబాబు నాయుడు

SHARE