హోదా ఇస్తే ఢిల్లీ వస్తా..బాబు

  chandrababu said if central govt give special status then i go delhi
మరికొన్ని గంటల్లో ప్యాకేజ్ ప్రకటన వస్తుందనుకున్న సమయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పీటముడి పడింది.ప్యాకేజ్ లో కొన్ని అంశాలపై తీవ్ర అసంతృప్తికి లోనైన ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా ఇస్తేనే ఢిల్లీ వస్తానని తేల్చేశారు.హోదాకి సమానమైన లబ్ది చేకూరేలా చేస్తామన్న కేంద్రం మాట నిలబెట్టుకోలేదని బాబు భావిస్తున్నారు.ఓ వైపు తమతో సంప్రదింపులు పూర్తి కాకుండానే బీజేపీ నేతలతో ప్రెస్ మీట్ పెట్టించింది కేంద్ర నాయకత్వమేనని కూడా ఆయనకి సమాచారం అందింది.తన సమక్షంలో ప్రకటన అంటూనే కమలం డబల్ గేమ్ ఆడుతోందని అనుమానిస్తున్న బాబు మంకు పట్టు పట్టారు.అయితే ఈ ప్రతిష్టంభనకు 1,2 రోజుల్లోపే తెర దించి ప్యాకేజ్ ప్రకటన చేస్తామని బీజేపీ ధీమాగా వుంది.

SHARE