దేశం నేతలకు పెన్షన్లు….

Posted October 6, 2016

  chandrababu said kl university  giving pensions tdp leaders

పార్టీలో పదవులపై టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్టీలో ఒక వ్యక్తికి ఒకటే పదవి ఇవ్వనున్నారు. ఈమేరకు కేఎల్ యూనివర్శిటీలో జరుగుతున్న టీడీపీ శిక్షణా తరగతుల్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారికి పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. నాయకుల పిల్లలకు ఎన్టీఆర్ స్కూల్‌లో సీట్లు, వృత్తి నైపుణ్య కేంద్రాల్లో శిక్షణ, ఉద్యోగాలను కల్పించనున్నారు. వచ్చే నెల నుంచి టీడీపీ కోర్ డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయనున్నారు. అలాగే జాతీయ అధికార ప్రతినిధులు, సీనియర్ నేతలు టీవీ డిబేట్లు, చర్చలకు వెళ్లాల్సిందేనని పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

SHARE