మోడీ ..బీజేపీ..వేర్వేరా ?

0
485

 chandrababu said modi bjp deferent
ఒకప్పుడు బీజేపీ అనగానే వాజపేయి,అద్వానీ గుర్తుకొచ్చేవాళ్ళు.ఆ తరువాత అసలెవర్ని గుర్తుకు తెచ్చుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.మూడేళ్ళుగా కమలం అంటే మోడీ మాత్రమే కళ్ల ముందు మెదిలే పరిస్థితి.ఆయనతో పాటు అమిత్ షా వున్నారని కొందరు చెప్పొచ్చు కానీ అయన మోడీ ఆజ్ఞల్ని,ఆలోచనల్ని పాటించే సుశిక్షిత సేనాని మాత్రమే.ఈ విషయం బహిరంగరహస్యమే.అయితే రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబుకి మాత్రం మోడీ,బీజేపీని వేర్వేరుగా మాట్లాటడం ఆశ్చర్య పరిచింది.

రాజ్యసభలో కేవీపీ ప్రైవేట్ బిల్లు అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్,బీజేపీ మనతో రాజకీయం చేస్తున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.రాజ్యసభ ముందుకు శుక్రవారం ప్రైవేట్ బిల్లు వస్తుందని తెలిసి కూడా ముందే చర్చకుకాంగ్రెస్ ఒప్పుకోవడాన్ని ..దాన్ని ద్రవ్య బిల్లుగా పరిగణించి లోక్ సభ పంపాలని కమలం కోరడాన్ని అయన తప్పు బట్టారు.రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే లోక్ సభలో బిల్లు పెట్టొచ్చుగా అని నిలదీశారు.అది పచ్చి నిజం కూడా ..

కానీ మోడీని కలిసిన సందర్భాన్ని వివరిస్తూ గతంలో జంటగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని కోరితే అయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.సభలో బీజేపీ రాజకీయం చేయడం ,మోడీ సానుకూల స్పందన ఒకే ప్రెస్ మీట్ లోచంద్రబాబు చెప్పిన మాటలు ..అదెలా సాధ్యం ? బీజేపీ,మోడీ వేర్వేరా?

కానే కాదు ..ఎక్కడో బాబు లెక్క తప్పింది ..లేదా అయన కూడా తెలిసిన విషయం చెప్పలేకపోయుంటారు ..

Leave a Reply