చంద్రబాబుకి కార్తీకం కష్టాలు?

 Posted November 4, 2016

chandrababu said party leaders should avoid caste party meetings in karthikamasa season
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇప్పుడు ఓ కొత్త సమస్య వచ్చిపడింది.అది కార్తీక మాసం తెచ్చి పెట్టిన తంటా .ఏపీ అభివృద్ధికి ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి కుల జాడ్యం ప్రధాన అవరోధంగా మారింది.కులతత్వం విపరీతంగా పెరగడం సమాజానికి మంచిది కాదని భావిస్తున్న బాబు ఇటీవల ఓ పార్టీ సమావేశంలో మంత్రులు ,ఎమ్మెల్యేలు ,నేతలతో కుల సంఘాలు ఏర్పాటు చేసే వనభోజనాలకు దూరంగా వుండాలని చెప్పారట .అక్కడ వున్న అన్ని కులాల నేతలు వెంటనే చాలా కష్టం సార్ అని మొహమాటం లేకుండా చెప్పారంట .మీ మాట విని వాటికి దూరంగా ఉంటే కుల సంఘాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుందని …దీన్ని ప్రతిపక్ష నేతలు అనుకూలంగా మార్చుకుంటారని కూడా బాబుని హెచ్చరించారట.

కొన్ని ఇబ్బందులున్నా కుల సంఘాల మీటింగ్ లకి వెళ్లకుండా ఉండటమే మేలని అప్పటికప్పుడు బాబు వారితో అన్నప్పటికీ దాని ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారంట. ఒకవేళ పార్టీ నేతల్ని వనభోజనాలకు వెళ్లనిస్తే అక్కడ వీళ్ళు ఏమి మాట్లాడుతారో …అదెటు దారి తీస్తుందోనన్న భయం కూడా బాబుకి లేకపోలేదు .ఈ పరిస్థితుల్లో కుల వ్యతిరేక వాదాన్ని బలంగా వినిపించడానికి అందరితో కలిసేలా పార్టీ నేతలతో వన భోజనాలు ఏర్పాటు చేయిస్తే అన్న ఆలోచన వచ్చినా దాని అమల్లో ఎక్కడ తేడా వచ్చినా కష్టం అవుతుందని ఓ నిర్ణయానికి వచ్చారట.ఏదేమైనా కులానికి ,రాజకీయానికి మధ్య కార్తీకం బాబుకి కొత్త కష్టం తెచ్చిపెట్టింది .

SHARE