ఆరులక్షల నేరగాళ్ల వేలిముద్రలున్నాయి …

0
512

   chandrababu said six lakhs thieves finger thumbs have

పుష్కర ఘాట్ల వద్దకు నేరస్థులు వచ్చారో.. ఇట్టే దొరికిపోతారు. జేబుదొంగలు, రౌడీషీటర్ల నుంచి పెద్ద పెద్ద నేరాలు చేసిన నేరగాళ్ల ఎవరైనా ఇక్కడకు వస్తే తప్పించుకోలేదు. కేవలం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన క్రిమినల్స్ వివరాలే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వివరాలతో మొత్తం ఆరు లక్షల మంది సమాచారం నిక్షిప్తమై ఉన్న ఆధునిక వ్యవస్థ ద్వారా నిఘా సాగుతోంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ సమయంలోనే నేరస్థుడిని గుర్తించే వీలుంటుంది. స్మార్ట్ ఫోన్‌లో పొందుపరిచిన వ్యవస్థ ద్వారా వేలిముద్ర వేయడం ద్వారా అధికారులు పరిశీలిస్తారు. సెల్‌ఫోన్‌లో వేలిముద్ర వేయగానే సదరు వ్యక్తి నిక్షిప్తం చేసిన ఆరు లక్షల నేరగాళ్ల రికార్డులో ఉంటే వెంటనే ఎరుపు రంగు సిగ్నల్ వెలుగుతుంది. లేకపోతే పచ్చరంగు చూపిస్తుంది. ఇదంతా కేవలం పది సెకండ్ల సమయంలోనే తెలిసిపోతుంది. దీంతో నేరగాళ్లు సులభంగా దొరికిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.

పుష్కరాల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఇటువంటి విధానాలు అవసరమన్నారు.మున్ముందు ఇలాంటి ఆధునిక వ్యవస్థల ద్వారానే నేర పరిశోధన, నియంత్రణ చేస్తామని సీఎం వివరించారు.

ఈ విధానంతోనే  తెనాలికి చెందిన పి.శ్రీను అనే నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ ఎస్ఐ బాలశౌరి నేతృత్వంలో జరిగిన బందోబస్తులో నేరస్థుడిని గుర్తించారు. ఎన్ఆర్ఐ సహకారంతో ప్రకాశం జిల్లా ఎస్‌పీ శ్రీకాంత్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి విధానంతో నేరస్థుల ఆగడాలకు చెక్ పెట్టడం వీలవుతుంది. 

Leave a Reply