విట్ కి బాబు పెట్టిన షరతు?

 Posted November 3, 2016

chandrababu said to vit college management build large university in ap
ప్రైవేట్ యూనివర్సిటీ ల ద్వారా అమరావతి బ్రాండ్ బిల్డ్ చేయాలని చూస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన రోజే విట్ కి ఓ షరతు పెట్టారు.ఐనవోలులో విట్ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసాక అయన ఓ విషయాన్ని ప్రస్తావించారు.విట్ కి ప్రస్తుతమున్న అన్ని క్యాంపస్ ల కన్నా అమరావతి ముందుండేలా చూడాలని అయన కోరారు.1984 లో విట్ 3 దశాబ్దాల్లో ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా రూపొందడం వెనుక వున్న కృషి సామాన్యమైంది కాదని బాబు అన్నారు. ఉన్నత విద్యలో ప్రస్తుతం ఐదో స్థానంలో వున్న ఏపీ అమరావతి కి రానున్న ప్రపంచస్థాయి యూనివర్సిటీ లతో నెంబర్ వన్ అయ్యే రోజులొస్తాయని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థుల నైపుణ్యం పెరిగితే దేశ సంపద వృద్ధి చెందడం కష్టం కాదని బాబు అన్నారు.అందులో భాగంగానే ఉన్నత ప్రమాణాలున్న యూనివర్సిటీ లకి పెద్ద పీట వేస్తున్నట్టు అయన చెప్పారు.

SHARE