ఆ లీకులు జంప్ జిలానీలకు షాకులు..

  chandrababu sarkar shocked ycp jumping mla
       గవర్నర్..ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ముఖాముఖీ ,ఏకాంతంగా మాట్లాడుకున్న మాటలు బయటికి రావడం కష్టం,ఎప్పుడో అరుదైన సందర్భాల్లో ఆ ముఖ్యమంత్రి లేదా గవర్నర్ మర్యాదపూర్వక భేటీ అని చెప్పడం సహజం.ఏదైనా కీలక చర్చ జరిగినా తమకి అవసరమైన మేరకే బయటికి చెపుతారు..లేదా లీకులు ఇస్తారు.ఇప్పుడు రాజ్ భవన్ కి సంబంధించిన అలాంటి భేటీనే కొద్దిమందికి కంగారు పుట్టిస్తోంది.ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు ..గవర్నర్ నరసింహన్ సమావేశమయ్యారు.అందులో బాబు క్యాబినెట్ విస్తరణ గురించి చెప్పగానే వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రిపదవులు విషయంలో గవర్నర్ సరికాదని అన్నట్టు  లీకులు వచ్చాయి.దీంతో బాబు సందిగ్ధంలో పడ్డారని కొన్ని పత్రికలూ రాసేసాయి.

       వైసీపీ నుంచి టీడీపీ లో చేరి మంత్రివర్గం లో స్థానం పై ఆశలు పెట్టుకున్న భూమా,జ్యోతుల,జలీల్ ఖాన్ వంటివారికి ..తాజా లీకులు షాకులిచ్చాయి. తమని రేసు నుంచి తప్పించడానికి టీడీపీ ఆస్థాన విద్వాంసులు ఈ లీకులు ఇచ్చి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.ఒక వేళ బాబే ఆ నిర్ణయానికి వచ్చి తమను మానసికంగా సిద్ధం చేస్తున్నారన్న డౌట్ కూడా వాళ్లకి వస్తోంది.అయితే ఆ విషయం బయటపడకుండా ఆస్థాన విద్వాంసులపై ఫిర్యాదు నెపంతో బాబుని కలిసి అయన ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఆ జుంపింగ్ నేతలు ప్రయత్నిస్తున్నారట .

SHARE