జగన్ కోరిక తీరుస్తున్న బాబు…లిటిగేషన్ పెట్టాడులే

0
599
chandrababu says about jagan using word

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

chandrababu says about jagan using word
2014 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ నోట ఒకటే మాట..”ఓ ఏడాదిలో ఎన్నికలు వస్తాయి,వచ్చేది మన ప్రభుత్వమే.రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి,గెలిచేది వైసీపీ” …ఇలా జగన్ పదేపదే ఎన్నికల గురించి పలవరిస్తూనే వున్నారు.జగన్ అంటే మండిపడిపోయే చంద్రబాబు స్వయంగా ఆ పలవరింతను నిజం చేసే మాట చెప్పారు.నిర్ణీత సమయం కన్నా ఓ 6 నెలల ముందు అంటే 2018 లో ఎన్నికలు జరగనున్నట్టు టీడీపీ శ్రేణులకు లీక్ చేశారు.అటు మోడీ కూడా జంట ఎన్నికలకు తహతహ లాడుతున్నారు కాబట్టి ఈసారి జగన్ కోరిక తీరడం ఖాయం అనిపిస్తోంది.ఇలా మిఠాయి లాంటి కబురుతో జగన్ ని ఖుషీ చేసిన చంద్రబాబు ఆ సంతోషానికి బ్రేక్ వేసే లిటిగేషన్ పెట్టాడు.

ఎన్నికల వార్తతో పాటు ఏపీ లో రాజకీయ పరిస్థితిపై జరిపించిన సర్వే వివరాల్ని కూడా చంద్రబాబు లీక్ చేశారు.ఆ సర్వే ప్రకారం 2014 ఎన్నికలతో పోల్చుకుంటే టీడీపీ కి 16 .13 శాతం ఓట్లు పెరిగాయని బాబు వివరించారు.అదే సమయంలో వైసీపీ బలం కిందటి ఎన్నికలతో పోల్చుకుంటే 13 .45 శాతం తగ్గిందని బాబు చెప్పారు.ఇక కాంగ్రెస్ ఓటింగ్ శాతం ఒకటి లోపేనట. ముస్లిమ్స్ లో టీడీపీ కి అనుకూలత బాగా పెరిగిందని కూడా బాబు తెలిపారు.ఎన్నికల మాట చెప్పి జగన్ ని ఖుషీ చేసిన చంద్రబాబు ఈ సర్వే వివరాలతో ఓ లిటిగేషన్ కూడా పెట్టారు కదా !

Leave a Reply